ప్రభాస్ కి ప్రతినాయకుడు..ఆయన?

సాహో తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌  ప్రభాస్ నెక్ట్స్ ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ‘జాన్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు చిత్రయూనిట్‌.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో వినిపిస్తోంది. 1950ల కాలంలో ఇటలీలో జరిగే ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు  జగపతి బాబు విలన్‌ పాత్రలో నటించనున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో జగపతి బాబు పాత్రలో చాలా విభిన్నంగా ఉంటుందన్న టాక్‌ వినిపిస్తోంది.

Videos