జై లవకుశ కలెక్షన్ల మోత.. వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న ఎన్టీఆర్

జై లవకుశ చిత్రం రిలీజైన రెండో రోజు కూడా కలెక్షన్ల మోత మోగించింది. ఎన్టీఆర్ చేసిన త్రిపాత్రాభినయానికి, ముఖ్యంగా జై పాత్రకు లభిస్తున్న విశేష ఆదరణతో వసూళ్లపరంగా జై లవకుశ దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించే చిత్రంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మంచి స్పందన కనిపిస్తున్నది. రెండో రోజు అందిన రిపోర్టుల ప్రకారం ఈ చిత్రం త్వరలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

అమెరికాలో జై లవకుశ భారీ వసూళ్లను సాధిస్తున్నది. తొలి మెట్టుగా ఒక మిలియన్ డాలర్ వసూళ్ల మార్కును అధిగమించింది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కెరీర్‌లో వరుసగా నాలుగో హిట్ నమోదైంది. శని, ఆదివారాల్లో ఈ చిత్రం మరిన్ని వసూళ్లను సాధిస్తే రెండు మిలియన్ డాలర్లను అధిగమించడం ఖాయం.

ఈ ఏడాది రిలీజైన బాహుబలి2, ఖైదీ నంబర్ 150 చిత్రాల సరసన జై లవకుశ నిలువనున్నది. తొలిరోజున భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం రెండో రోజునాటికి మొత్తంగా 80 కోట్ల రూపాయలను వసూళు చేసినట్టు ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు.

బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. తొలి వారాంతం ముగిసే సమయానికి ఈ చిత్రం 100 కోట్ల మార్కును అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఎన్టీఆర్ కెరీర్‌లో అతి వేగంగా వంద కోట్లను సాధించిన చిత్రంగా జై లవకుశ ఓ రికార్డును సొంతం చేసుకుంటుంది.

Nizam – 7,33,00,000

Ceded – 5,25,00,000

Nellore – 1,28,00,000

Guntur – 3,48,00,000

Krishna – 2,18,00,000

West – 2,15,00,000

East – 3,39,00,000

Uttharandhra – 2,69,00,000

Total 2 days AP & TS Share – 27.75 Cr (21.55 Cr on Day 1 & 6.2 Cr on Day 2)

Total 2 days AP & TS Gross – 40 Cr approx.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *