జై లవకుశ గట్టి షాకులే ఇచ్చాడే

జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న జై లవకుశ ఆడియో నేరుగా యు ట్యూబ్ లో రిలీజ్ చేసేసారు. ఊహించని రీతిలో నాలుగే పాటలు ఉన్న ఈ ఆల్బంలో మరో స్పెషల్ మాత్రం దాచి పెట్టి ఇప్పుడు విడుదల చేయకుండా ఆపారు. ఇక నాలుగు పాటల్లో ‘రావణ’ అనే ఫస్ట్ సాంగ్ విలన్ జై పాత్రకు సంబంధించినది కాగా, ‘ట్రింగ్ ట్రింగ్’ పాట  లవ కుమార్, రాశి ఖన్నా జోడికి, ‘నీ కళ్ళలోనా’ పాట జై, నివేదా థామస్ జోడికి, ఇక మిగిలిన నాలుగో పాట ‘దోచుకో’ కుశ పాత్ర ఇంట్రడక్షన్ కి ఇచ్చేసారు.

మరి కుశ కు జోడి లేదు అనేది స్పష్టమైపోయింది. దాచి పెట్టిన సాంగ్ ఏమైనా కుశ కోసం రిజర్వు చేసారేమో మరి. దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ రెగ్యులర్ గానే అనిపిస్తున్నా క్యాచీ గానే ఉన్నాయి. ఫస్ట్ టైం విన్నప్పుడు రిపీట్ గా అనిపించి వినగా వినగా వాటినే సూపర్ హిట్ సాంగ్స్ అనిపించేలా చేయటం దేవి స్టైల్.

రావణ సాంగ్ మాత్రం చాలా టెర్రిఫిక్ గా ఉంది. దీన్ని బట్టి కథలో జై దే కీలక పాత్ర అని అర్థమైపోతోంది. చాలా లోతుగా ఉన్న పదాలతో చంద్రబోస్ మంచి సాహిత్యాన్ని ఇచ్చాడు. ఇక రెండో పాట ట్రింగ్ ట్రింగ్ రానున్న రోజుల్లో టాప్ ట్యూన్ గా మారడం ఖాయం. మూడో పాట నీ కళ్ళలో కూడా మంచి మెలోడీ.

నాలుగో పాట దోచుకో మాత్రం కుశ పాత్ర దొంగ అని చెబుతూనే రెగ్యులర్ గా విన్న పాట లాగా అనిపించినా తర్వాత కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మూడు పాత్రలు చేస్తూ నాలుగు పాటలే ఉండటం పట్ల ఎన్టీఆర్ ఫాన్స్ ఆశ్చర్య పోతున్నారు. మొత్తానికి జై లవకుశ ఆడియో నుంచే సంచలనాలు రేపడం మొదలు పెట్టింది. ట్రైలర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ 21 రావడంలో ఇక ఎటువంటి అనుమానం అక్కర్లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *