‘జై లవకుశ’ నుండి కొత్త పోస్టర్ విడుదల

ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్న చిత్రం ‘జై లవకుశ’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఒక పాత్ర పేరు లవకుమార్, మరో పాత్ర పేరు జై అని తెలుస్తుండగా మూడో పాత్రకు సంబంధించి క్లారిటీ రావలసి ఉంది. ఆ మధ్య పోస్టర్ తో మొదటి హీరోయిన్ రాఖి ఖన్నా అని కన్ ఫాం చేసిన చిత్ర యూనిట్ తాజాగా నివేదా థామస్ సెకండ్ హీరోయిన్ అంటూ పోస్టర్ ద్వారా తెలిపారు. నివేదా థామస్.. నాని నటించిన ‘జెంటిల్మెన్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాగా, ఈ అమ్మడి నటనకు విమర్శకుల ప్రసంశలు లభించాయి. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘నిన్ను కోరి’ చిత్రంలోను నివేదా ధామస్ కథానాయికగా నటిస్తుంది. ఇదిలా ఉంటే శ్రీరామనవమి సందర్భంగా జై లవకుశ మోషన్ పోస్టర్ విడుదల చేయగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ రెండో వారంలో ఈ మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

jai-lavakusa-new-movie-poster-released
jai-lavakusa-new-movie-poster-released
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *