జైసింహా సెన్సార్‌ టాక్‌..

నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం జైసింహా. కేఎస్ రవికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, హరిప్రియ, నఠాషా దోషి కథానాయికలుగా నటించారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ టాక్ బయటకు వచ్చింది. సినిమాలో మాస్ డైలాగ్స్ కు కొదవ లేదట.యాక్షన్ సీన్స్ , బాలయ్య, నయనతారల మధ్య సెంటిమెంట్ సీన్లు, క్లైమాక్స్ మనసును టచ్ చేసేలా ఉన్నాయట.

అలాగే చిరంతన్ భట్ మ్యూజిక్, థీమ్ సాంగ్ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా ఉన్నాయట. సి.కల్యాణ్ చెప్పినట్టు ఓ పాటలో బాలయ్య డ్యాన్స్ అదిపోయిందట. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *