జైష్ చీఫ్ మసూద్ అజార్ ను రహస్యంగా విడుదల చేసిన పాక్…భారత్ పై దాడికేనా

భారత్ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ ను దెబ్బతీయాలని ఇప్పటి వరకు పాకిస్థాన్ చేయని ప్రయత్నం లేదు. తాజాగా భారత్ లో ఉగ్రకుట్రలు పాల్పడేందుకు వ్యూహాలు రచిస్తుందని సమాచారం. దీనిలో భాగంగానే జైలు నుండి జైష్ మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ ఆజాద్ ను రహస్యంగా విడుదల చేసినట్టు భారత ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దులోని పంజాబ్, రాజస్తాన్, సియోల్ కోట ప్రాంతాల్లో భారత బలగాలను అప్రమత్తం చేయాలని ఐబీ హెచ్చరించింది.

ఐబీ చెందిన ఇద్దరు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం రాజస్తాన్-కాశ్మీర్ సెక్టార్లలో పెద్ద కుట్రకు పాక్ ప్రయత్నిస్తుంది. ఈ మేరకు రాజస్తాన్ సరిహద్దుల్లో భారీ స్తాయిలో ఆర్మీని మోహరించినట్టు జమ్ము, రాజస్తాన్ సరిహద్దుల్లో ఉన్న భద్రత దళానికి సమాచారం అందింది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ అడుగుముందుకేసి కశ్మీర్‌కు తాము అండగా ఉంటామని, అవసరమైతే భారత్‌తో యుద్ధానికి కూడా సిద్ధంగా ఉంటామని, భారత్‌పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని కూడా వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరొందిన అజార్‌ ను భారత్‌ పై యుద్ధానికి ఉసిగొల్పేందుకు జైలు నుంచి విడుదల చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. భారత నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ, రక్షణ సిబ్బంది సరిహద్దులో భద్రతను మరింత పెంచింది. బలగాలను అప్రమత్తం చేసింది. కాగా అజాద్‌ను అరెస్ట్‌ చేయాల్సిందిగా ఇటీవల అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలు పాక్‌పై ఒత్తిడి చేయడంతో అతన్ని అరెస్ట్‌ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.

 

Videos