జనసేన ఎమ్మాల్యే రాపాక అరెస్ట్

జనసేన ఎమ్మాల్యే రాపాక వర ప్రసాద్ పోలీసులకు లొంగిపోయాడు దీనితో రాజోలులో హైడ్రామా నెలకొంది. రాపాక పోలీసులకు లొంగిపోయిన వెంటనే జనసేన కార్యకర్తలు, ఎమ్మెల్యే మద్దతుదారులు పెద్ద ఎత్తున పోలీస్‌ స్టేషన్‌ బయట బైఠాయించారు. అనంతరం రాపాకను రాజోలు పోలీస్‌ స్టేషన్‌ నుంచి కోర్టుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. దీంతో కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు చివరికి ఎమ్మెల్యేను కోర్టుకు తరలించారు. పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోవడంలో అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాపాక తన అనుచరులతో కలిసి పోలీస్‌ స్షేషన్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published.