జనతా గ్యారేజ్ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించిన కొరటాల

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. సమంత, నిత్యమీనన్ కథానాయికలు.

ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు గ్యారేజ్ టీజర్ – ఆడియో కోసం ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ లో సినిమాపై ఉన్న ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసేలా గ్యారేజ్ టీం టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే గ్యారేజ్ టీం టీజర్ రిలీజ్ త్వరలోనే ఉంటుందని చెప్పినా డేట్ మాత్రం చెప్పలేదు.

ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదలవుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు చుక్కెదురైంది. కేవలం రెండు పోస్టర్లను విడుదల చేయడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. తాజాగా కొరటాల చేసిన ప్రకటన మళ్ళీ వారిలో ఆనందం నింపనుంది. ఇంతకాలం టీజర్ కోసం ఓపిగ్గా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన కొరటాల జులై 6న ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ టీజర్ విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన పాటలు కూడా అదే నెలలో విడుదల కానున్నాయి. సినిమా ఆగష్టు 12న విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published.