ట్రైలర్ : ‘జనతా గ్యారేజ్’ ట్రైలర్లోనే కథ చెప్పేసారు

ఆనంద్ కు మొక్కలంటే చాలా ఇష్టం. అలాగే జనతా గ్యారేజ్ అధినేత మోహన్ లాల్ కు మనుషులంటే చాలా ఇష్టం. ముంబయ్ లో ఎక్కడో నేచర్ ని డిస్ర్టాయ్ చేయకండి అంటూ యుద్దం చేసే ఒక స్టూడెంట్.. అలాగే హైదరాబాద్ లో మనుషుల కోసం పోరాడే ఈ పెద్దాయన. ఇద్దరూ పోరాడేది ఇతర ప్రాణుల కోసమే. వీరిద్దరినీ నేచర్ కలిపింది. అందులోనే ఉంది అసలు కిక్ అంతా. అబ్బబ్బా.. పదండి ఈ డిటైల్స్ అన్నీ చూద్దాం.

ఈ భూమితో పాటు ఈ భూమి మీద ఉన్న సృష్టి అన్నా ఆనంద్ కి ఎంతో ఇష్టం. చెట్లు, మొక్కులు, గాలి, నీరు వాటిని కాపాడు కోవడమే అని పని కూడా. అతని చెట్లంటే ఎంత ప్రాణమో… బుజ్జి(సమంత) అంటే కూడా అంతే ఇష్టం. ఎక్కడో ఇంకో చోట ఉండే పెద్ద మనిషి(మోహన్ లాల్) కి ఈ భూమి మీద ఉండే మనుషులంటే ఎంతో ఇష్టం. ఎదుటోడి కష్టం విని, కళ్లలో నీళ్లు తిరిగి గొంతులో ముద్ద దిగక పోవడం.. లాంటి క్యారెక్టర్ అతడిది. సృష్టికి ఇద్దరినీ కలిపితే బావుండనిపించిందో ఏమో… మెక్కలతో పాటు ఈ భూమి మీద ఉన్న మనుషులను కూడా కాపాడితే ఈ భూమి ఇంకా అందంగా ఉంటుందని ఎన్టీఆర్ తో చెబుతాడు మోహన్ లాల్. జనతా గ్యారేజ్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుందంటూ పిలుస్తాడు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *