జనతా గ్యారేజ్ మూవీ న్యూ పోస్టర్స్

అప్పటిదాకా ఎన్టీఆర్ లుక్ ఒక మూసలో ఉంటుండేది. అతడి సినిమాల్లాగే లుక్ కూడా రొటీన్ గా ఉంటే ఉండేది. కానీ ‘టెంపర్’తో కంప్లీట్ మేకోవర్ అయ్యాడు తారక్. ఆ సినిమా మీద హైప్ రావడానికి  తొలి కారణం ఎన్టీఆర్ లుక్కే. ఆ తర్వాత ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు మరింత రిఫ్రెషింగ్ లుక్ లోకి మారిపోయి.. అభిమానులకు సరికొత్త అనుభూతినిచ్చాడు తారక్. ఇప్పుడిక ‘జనతా గ్యారేజ్’ విషయంలోనూ ఎప్పటికప్పుడు అదిరిపోయే లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు.

ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’కు సంబంధించిన ప్రతి పోస్టరూ ఆకట్టుకుంది. స్టైల్.. ఇంటెన్సిటీ అన్నీ కలగలిసేలా పోస్టర్లు డిజైన్ చేయించాడు కొరటాల. తాజాగా ‘జనతా గ్యారేజ్’ ఆడియోకు ముహూర్తం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక కొత్త పోస్టర్ వదిలాడు కొరటాల. ఇందులో ఎన్టీఆర్ లుక్ వారెవా అనిపిస్తోంది. సినిమాలో ఉన్న ఇంటెన్సిటీని ఈ పోస్టర్ ద్వారా చూపించడానికి ట్రై చేస్తున్నట్లున్నాడు కొరటాల. ఈ పోస్టర్ కు సోషల్ మీడియాల అద్భుతమైన స్పందన వచ్చింది. ఆడియో ఫంక్షన్ లోపు ఇలాంటి పోస్టర్లు ఇంకొన్ని రిలీజ్ చేస్తారట. ఇలాంటి ఆసక్తి రేకెత్తించే పోస్టర్లు రిలీజ్ చేస్తూ పోతే చాలు.. ఇక సినిమాకు వేరే పబ్లిసిటీ అక్కర్లేదు అన్నట్లుగా ఉంది పరిస్థితి.

Videos

Leave a Reply

Your email address will not be published.