అమ్మ మాటే శాసనం భీష్మ పథం!

జయలలితకు స్వతంత్ర భావాలు ఎక్కువ. ఆమె పట్టుదల చాలా గట్టిది. ఎంజీఆర్‌ చాటున బతికినా ఆమెకంటూ కొన్ని నిర్ధిష్ట అభిప్రాయాలుండేవి. అమర్యాదను సహించేవారు కాదు. అవమానాన్ని జీర్ణించుకోలేకపోయేవారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోయేవారు. కరుణానిధినే కాదు.. ఎంజీఆర్‌నూ వదల్లేదు. సహనటుల గురించి చెప్పనక్కర్లేదు. ఆమెకు ఎవరైనా, ఎంతపెద్దవారైనా వంగి దండం పెట్టాల్సిందే. అలా చేయని పార్టీ నేతలను దూరం పెడతారు. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆమె సినీజీవితం 1980నాటికి వెలవెలబోయింది. ఎంజీఆర్‌ తనను విస్మరించాక తెలుగు హీరో శోభన్‌బాబుకు దగ్గరయ్యారని చెబుతారు. ఇదెంత వరకు నిజమో తెలియదు. కానీ తర్వాత ఆమె ఒంటరితనంతో కుంగిపోయారు. సోదరుడు జయకుమార్‌ కూడా ఆమె బాగోగులు చూడలేదు. 1981లో అమ్మ ఆత్మహత్యకు ప్రయత్నించారన్న ప్రచారం కూడా జరిగింది. ఇది తెలిసి సీఎం ఎంజీఆర్‌ మళ్లీ ఆమెను చేరదీశారు.
కరుణను బర్త్‌రఫ్‌ చేయని ఎన్డీయే సర్కార్‌నే కూల్చేశారు

1998లో వాజ్‌పేయి ప్రభుత్వానికి జయ మద్దతు ప్రకటించారు. కానీ రాష్ట్రపతికి లేఖ సమర్పించేందుకు తిప్పలు పెట్టారు. ఆమె లేఖ ఇస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని కోరతానని వాజ్‌పేయి చెప్పారు. జయ తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యా యి. చివరకు ఆమె మద్దతు లేఖ ఇచ్చారు. అనంతర కాలంలో నాటి తమిళనాడు సీఎం కరుణానిధిని బర్తరఫ్‌ చేయాలని ఒత్తిడి తెచ్చారు. వాజ్‌పేయి అంగీకరించకపోవడంతో ఆయనకు మద్దతు ఉపసంహరించారు. విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో వాజ్‌పేయి ఓడిపోయారు.

 ఆనందమొస్తే!

పోయెస్‌ గార్డెన నుంచి సచివాలయానికి మెరీనాతీరం మీదుగానే వెళ్లాలి. ఈ మార్గంలో ఎంతో మంది అవసరార్థులు రోడ్డుకిరువైపులా ఉండి ఆమె వెళ్లేటప్పుడు మోకరిల్లుతుంటారు. వారిని చూసుకుంటూ వెళ్లేటప్పుడు ఎవరు అర్హులని అనిపిస్తే వారి గురించి తెలుసుకోవాలని తన భద్రతా సిబ్బందికి చెబుతారు. వారి అవసరాలు పూర్తి చేయిస్తా రు. కొన్ని వేల మంది ఇలా సాయం పొందారు. ఆమె సాయం పొంది కోటీశ్వరులుగా మారిన వారూ వున్నారు. 2012లో అన్నాడీఎంకేకి చెం దిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రతిపక్షం డీఎంకేపై విరుచుకుపడ్డాడు. అతని వాగ్ధాటికి మురిసిపోయిన జయ మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

 ఎవరైనా అంతే!

జయకు కోపమొస్తే ప్రత్యర్థులు అథఃపాతాళానికి వెళ్లాల్సిందే. 2003 లో జయ సీఎంగా ఉన్నప్పుడు జీతభత్యాల పెంపు డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఆగ్రహించిన జయ ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఆ లక్ష మందిపై వేటు వేశారు. తొలగింపు తో ఖాళీ అయిన పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఉద్యోగులు లేకపోవడంతో ప్రభుత్వ కార్యక్రమాలు ఆగిపోకుండా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్లతో వస్తే చాలు, ఉద్యోగంలో చేర్చుకునేలా ఆదేశాలు జారీ చేశారు.

 నోరు జారినా ముప్పే!

జయ తరువాత తానేనంటూ సరదా గా వ్యాఖ్యానించిన ఓ విశ్వాసపాత్రుడిని జయ పాతాళానికి తొక్కేశారు. 2011లో అసెంబ్లీ స్పీకర్‌గా వున్న డి.జయకుమార్‌ సరదాగా వ్యాఖ్యానించినట్లు తెలియడంతో ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించడంతో పాటు పార్టీలోనూ ప్రాధాన్యం తగ్గించా రు. అయినా నమ్మకంగానే వ్యవహరించడంతో 2016 ఎన్నికల తరువాత మళ్లీ మంత్రి పదవిని కట్టబెట్టారు.

 సుధాకరన్‌ ఏమయ్యాడు!

‘అమ్మ..అమ్మ’అంటూ తన చుట్టూ తిరిగిన శశికళ సమీప బంధువు సుధాకరనను దత్తత తీసుకున్న జయ ఆనక అతను పార్టీలోనూ, వ్యక్తిగత వ్యవహారాల్లోనూ మించిపోతున్నాడన్న కోపంతో దత్తత ను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. తరువాత సుధాకరన పార్టీ కార్యక్రమాల్లో గానీ, పోయెస్‌ గార్డెన ఛాయల్లో గానీ కనిపించలేదు. అంతేనా, ఆయన వద్ద హెరాయిన పట్టుబడ్డట్టు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

 మీడియాపైనా ఉక్కుపాదం

తనకు వ్యతిరేకంగా రాసిన మీడియాపైనా జయ ఉక్కుపాదం మోపేందుకు సాహసించారు. వేళ్లూనుకునిపోయిన పత్రికాధిపతుల్ని సైతం పరుగులు పెట్టించారు. దీంతో ఆఖరికి ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనా, అసలేం జరిగిందో తెలుసుకుని రాసేందుకు సైతం తమిళ మీడియా జంకింది. ప్రభుత్వం, ఆసుపత్రి ఇచ్చిన ప్రకటనల్ని యధాతథంగా ప్రచురించడం మినహా జయ ఆరోగ్యంపై ‘పరిశోధనా కథనాలు’ రాసేందుకు సైతం ఇక్కడి మీడియా తటపటాయించింది.

 పరాభవం..!

1987లో ఎంజీఆర్‌ మరణం జయలలితకు బాధతోపాటు అవమానా న్నీ మిగిల్చింది. ఎంజీఆర్‌ సతీమణి జానకి మద్దతుదారులు జయపై చేయి చేసుకున్నంత పనిచేశారు. ఎంజీఆర్‌ మృతదేహం తల భాగాన నిలబడి ఉన్న జయను ఈడ్చుకుంటూ బయటకు గెంటేశారని అన్నాడీఎంకే వర్గాలు గుర్తు చేసుకుంటుంటాయి. ఈ ఘటన ఆమెపై ఎంతో ప్రభావం చూపింది. అదే సమయంలో ఆ ఘటనని ఉపయోగించుకొని జానకికి వ్యతిరేకంగా ప్రజా సానుభూతి పొందేందుకు ఆమె ఎత్తుగడ వేశారు. ఆ తరువాత తనకంటూ ప్రత్యేక బలాన్ని కూడగట్టుకోవడం మొదలుపెట్టారు. క్రమంగా అన్నాడీఎంకేలో జానకి ప్రభావం తగ్గి పార్టీ మొత్తం జయ చేతుల్లోకి వచ్చేసింది.

 3 శపథాలు!
 భీష్మ ప్రతిజ్ఞ
జూ 1989 ఎన్నికల్లో జయ వర్గం 27 స్థానాల్లో గెలిచి ఆమె ప్రతిపక్ష నాయకురాలయ్యారు. జానకి వర్గం అదే ఏడాది జయ పార్టీలో విలీనమైంది. ఆ సంవత్సరంలోనే తమిళనాడు అసెంబ్లీలో కనీవినీ ఎరుగని దుశ్శాసన పర్వం జరిగింది. సీఎం కరుణానిధి ప్రోద్బలంతో డీఎంకే ఎమ్మెల్యేలు సభలోనే ఆమె చీరలాగేందుకు ప్రయత్నించిన ఘటన దేశమంతా కలవరం రేపింది. ఆమెను కొట్టి గాయపరిచారు కూడా. చిరిగిన చీరతో అసెంబ్లీ నుంచి బయటకొచ్చిన ఆమె సీఎం పదవి చేపట్టేవరకు అసెంబ్లీలో అడుగుపెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేశారు. అన్నట్లుగానే 1991లో సీఎం అయ్యారు.
కరుణనూ అదే జైలుకి!

1996లో డీఎంకే ప్రభుత్వ హయాంలో అక్రమాస్తుల కేసులో జయ జైలుకి వెళ్లారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ‘నేను ఎక్కడికైతే వెళ్లానో, నా ప్రత్యర్థుల్ని కూడా అక్కడికే పం పిస్తాను’ అని బహిరంగంగా జయ శపథం చేశారు. 2001లో జయ సీఎం అయ్యారు. అన్నట్టుగానే కరుణానిధిని అర్థరాత్రి అరెస్టు చేయించి, తనను ఉంచిన జైలు గదిలోకే తోశారు.

బంగారానికి దూరం!

జయలలిత నివాసం నుంచి ఐటీ అధికారులు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు. జయ ఇంట దొరికిన బంగారమంతా ఆమెకు బహుమతిగా లభించిందేనని డీఎంకే నేతలు ఎద్దేవా చేశారు. దీనిపై ఆగ్రహించిన జయ కేసు నుంచి బయటపడేవరకు, బంగారం ధరించబోమని భీకర ప్రతిజ్ఞ చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *