అపోలో ఆస్పత్రిలో జయలలిత… వీడియో

తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌..జయలలిత మరణంతో ఖాళీ  ఆర్కేనగర్ లో రేపు ఉపఎన్నిక జరుగుతుండగా అందరూ ఆ ఎన్నికపై దృష్టిపెట్టారు.  ఇంతలో జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు దినకరన్ వర్గం హఠాత్తుగా అందరికి షాక్ ఇచ్చారు.   దినకరన్ వర్గానికి చెందిన నేతలు…జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో జయ  గ్లాస్‌లో పండ్లరసం తాగుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.

జయలలిత మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు దినకరణ్ వర్గం ఈ వీడియోను రిలీజ్ చేసినట్లు తెలుస్తున్నది. గతంలో తమ దగ్గర జయకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని దినకరన్ వర్గం వెల్లడించింది. మరోవైపు జయలలిత మృతిపై తమిళనాడు ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ వేసిన విషయం తెలిసిందే.

గతేడాది సెప్టెంబర్ 22న జయలలిత అస్వస్థతకు గురికావడంతో చెన్నైలోని అపొల్లో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి డిసెంబర్ 5న తుదిశ్వాస విడిచే వరకు 75 రోజుల పాటు అక్కడే ఆమె చికిత్స పొందారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *