జియో గుడ్న్యూస్ మార్చి 31వరకు ఉచితం: ముఖేష్ అంబానీ

జియో విజయం తమ ఖాతాదారులదేనని ముఖేష్ అంబానీ అన్నారు. ఇవాళ ఆయన ఒక సమావేశంలో మాట్లాడారు. అత్యంత సాంకేతికతను అందించే సంస్థ జియో అని తెలిపారు. జియోతో ప్రతీరోజు 6 లక్షల మంది వినియోగదారులు అనుసంధానం కావడం సంతోషమని పేర్కొన్నారు. ఇతర నెట్ వర్క్‌లతో పోల్చితే జియో 25 రెట్లు అధిక వేగమని తెలిపారు. తమను నమ్మిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సలహాలు, సూచనలు స్వీకరించేందుకు లాంచింగ్ ఆఫర్ ఇచ్చామన్నారు.

జియో అంత్యంత వేగంగా 5 కోట్ల వినియోగదారులన సంఖ్యను అధిగమించిందన్నారు. జియో వినియోగదారులకు ఇరత నెట్ వర్క్‌లు సహకరించడంలేదని తెలిపారు. జియోకు వచ్చే 9 వేల కోట్ల కాల్స్ ను ఇతర ఆపరేటర్లు బ్లాక్ చేశారని పేర్కొన్నారు. జియో సర్వీసులో మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ తీసుకు రమ్మన్నామని చెప్పారు. నెంబర్ పో్ర్టబిలిటీని ఇకపై వినియోగదారులకు అందిస్తామన్నారు. నెంబర్ పోర్టబిలిటీని ఇకపకై వినియోగదారులకు అందిస్తామన్నారు. 2017 మార్చి 31 వరకు జియో సేవలు ఉచితమని వెల్లడించారు. డిసెంబర్ 31 నుంచి 100 నగరాల్లో ఇంటికే జియో సిమ్ సౌలభ్యం కల్పిస్తామన్నారు. ఇకపై ప్రయాణ టికెట్ల కోసం క్యూ లైన్ లో నిలుచోవాల్సిన అవసరంలేదన్నారు. డిజిటల్ ఎకానమీ ద్వారా దేశం మరింత వృద్ధిలోకి వస్తుందన్నారు. డిసెంబర్ 5 నుంచి జియో మనీ మర్చంట్ అప్లికేషన్ అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించారు. జియోమనీ మర్చంట్ అప్లికేషన్ తో నగదు లావాదేవీలు చేయవచ్చన్నారు.

డిసెంబర్ 4వ తేదీ నుంచి జియో సిమ్ తీసుకునే కస్టమర్లకు మార్చి 31 వరకు ఫ్రీ డేటా ఇవ్వనున్నట్టు ముఖేష్ తెలిపారు. డిసెంబర్ 31 తర్వాత పాత కస్టమర్లకు నూతన సంవత్సర ఆఫర్ కల్పిస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఉచిత ఫోన్ కాల్స్ సదుపాయం కొనసాగిస్తామన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *