‘జోడీ’ మూవీ రివ్యూ…

ఆది సాయి కుమార్ తాజాగా నటించిన చిత్రం జోడీ. విరామం లేకుండా సినిమాలు చేస్తున్న విజయం మాత్రం ఆయన్ని ఉరిస్తూనే ఉంది. ఇటీవలే బుర్రకథ అనే సినిమాను తీసి పరాజయాన్ని చూశాడు. ఇప్పుడు విడుదలయైన జోడీ అతనికి సక్సెస్ అందించిందా? ఆయన సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారా?

jodi1కథ:

కపిల్(ఆది సాయికుమార్) ఐ‌టి కంపెనీలో పనిచేస్తుంటాడు. అతని తండ్రి కమలాకర్(నరేశ్) బెట్టింగులకు అలవాటు పడ్డ వ్యక్తి. ఒక క్రికెట్ క్లబ్ లో ఎప్పుడు బెట్టింగులు కస్తూ ఉంటాడు. క్రికెట్ మీద పిచ్చితో కొడుక్కి కపిల్‌ అని పేరు పెంటుకుంటాడు. తండ్రి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటంతో ఆ బాధ్యతను తాను తీసుకుంటాడు కపిల్‌. సాప్ట్‌ వేర్‌ కంపెనీలో పనిచేసే కపిల్‌, ఫ్రెంచ్‌ లాంగ్వేజ్‌ ఇన్సిస్టిట్యూట్‌లో పనిచేసే కాంచనమాల తో ప్రేమలో పడతాడు. కపిల్ మంచితనం, బాధ్యతగా ఉండటం చూసి కాంచనమాల కూడా కపిల్‌ను ఇష్టపడుతుంది. కానీ కాంచన, బాబాయి రాజు (శిజ్జు) మాత్రం వారి పెళ్లికి అంగీకరించడు. తన అన్న కూతురిని ప్రాణంగా చూసుకునే రాజు.. కాంచన, కపిల్‌ల పెళ్లికి ఎందుకు నో చెప్పాడు..? ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధం ఏంటి..? ఈ కథలోకి ఇండస్ట్రియలిస్ట్‌ అవినాష్‌ ఎలా వచ్చాడు..? అన్నదే మిగతా కథ.

jodi2విశ్లేషణ:

ప్రేమ, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆది ఈ సారి ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఓ రొమాంటిక్‌, ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్నాడు. దర్శకుడు విశ్వనాథ్‌ అరిగెల ప్రేమకథతో పాటు మంచి సందేశం, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉండేలా కథను రెడీ చూసుకున్నాడు. అయితే ఆ కథను తెర మీదకు తీసుకురావటంలో మాత్రం తడబడ్డాడు. ముఖ్యంగా లవ్‌ స్టోరిలో కొత్తదనం లేకపోవటంతో ప్రథమార్థం బోరింగ్‌గా సాగుతుంది. సెకండ్‌ హాఫ్‌లో కథ ఆసక్తికర మలుపు తిరిగినా.. కథనం నెమ్మదిగా సాగటం నిరాశపరుస్తుంది. జెర్సీ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ శ్రద్ధా ఈ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్‌ చేసుకున్నారు. వెన్నెల కిషోర్ తెర మీద కనిపించినంత సేపు నవ్వించదు. ఫణి కల్యాణ్‌ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఒక్క పాట కూడా గుర్తుండిపోయేలా లేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: కథ,ఆది, వెన్నెల కిషోర్ కామెడీ

నెగెటివ్ పాయింట్స్: నెమ్మదిగా సాగే కథనం, రొటీన్ టేకింగ్

టైటిల్: జోడి

తారాగణం: ఆది సాయి కుమార్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, నరేష్‌, వెన్నెల కిశోర్‌, సత్య

సమర్పణ: భావనా క్రియెషన్స్

దర్శకత్వం: విశ్వనాథ్‌ అరిగెల

సంగీతం: ‘నీవే’ ఫణి కల్యాణ్‌

నిర్మాత: పద్మజ, శ్రీ వెంకటేష్ గుర్రం

 

Videos