తొలి టెస్టు తొలి రోజు భారత్ విఫలం, జో రూట్ సెంచరీ

క్యాచెస్ విన్ మ్యాచెస్.. ఈ సామెత భారత ఫీల్డర్లకు గుర్తులేన్నట్లుంది. టెస్టుఫార్మాట్‌లో క్యాచ్‌లు రావడమే చాలా అరుదు. అలాంటిది వచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేయడం, అదీ కూడా ప్రత్యర్థి జట్టులో కీలక బ్యాట్స్‌మెన్‌ది కావడంతో బుధవారం రాజ్‌కోట్‌లో ప్రారంభమైన తొలిటెస్టులో ఇంగ్లండ్ కుదురుకుంది. రెండుసెషన్ల పా టు టీమ్ ఇండియా బౌలర్లను ఓ ఆటాడుకున్న స్టార్ ప్లే యర్ జో రూట్(180 బంతుల్లో 124; 11ఫోర్లు, 1 సి క్స్) శతకంతో చెలరేగితే, ఆల్‌రౌండర్ మొయిన్ అలీ (192 బంతుల్లో 99 బ్యాటింగ్; 9 ఫోర్లు) అడుగుదూ రంలో నిలిచాడు. ఈ ఇద్దరి జోరుతో తొలిరోజు ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్‌లో 4వికెట్లకు 311 పరుగులు చేసింది. అలీకితోడు స్టోక్స్ (19) క్రీజులో ఉన్నాడు.

అశ్విన్ రెండు..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు కుక్ (21), హమీద్(31)లను ఆరంభంనుంచే భారత బౌల ర్లు ఇబ్బందిపెట్టారు. కానీ స్లిప్, గల్లీలో లో లెవల్ క్యాచ్‌లను అందుకోవడంలో మన ఫీల్డర్లు విఫలమయ్యారు. ఇన్నింగ్స్ మూడోబంతికి కుక్ ఇచ్చిన క్యాచ్‌ను గల్లీలో రహానే జారవిడిస్తే.. 13 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద హమీద్ బ్యాట్‌ను తాకి వచ్చిన బంతిని స్లిప్‌లో విజయ్ నేలపాలు చేశాడు. ఈ రెండు పరిణామాలతో స్కోరుబో ర్డుపై కొన్ని రన్స్ సమకూరాయి. పదోఓవర్ నుంచి అశ్వి న్, జడేజా స్పిన్ దాడి మొదలుపెట్టారు. వీరి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఓపెనర్లు తొలిగంటలో 15ఓవర్లలో 47రన్స్ చేశారు. డ్రింక్స్ తర్వాత జడేజా వేసిన తొలిబంతి (16వ ఓవర్) ఊహించని విధంగా టర్న్ కావడంతో కుక్ వికెట్లముందు దొరికిపోయాడు.

దీంతో తొలివికెట్‌కు 47పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈదశలో రూట్, హమీద్‌లు పేస్, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. అశ్విన్ వేసిన ఏడో ఓవర్‌లో చక్కని కవర్‌డ్రైవ్‌లతో రూట్ వరుస ఫోర్లు బాదడంతో కాస్త జోరు పెరిగింది. కానీ రెండు ఓవర్ల తర్వాత బంతిని బాగా ైఫ్లెట్ చేస్తూ హమీద్‌ను బోల్తా కొట్టించి అశ్విన్ ప్రతీకారం తీ ర్చుకున్నాడు. హమీద్ డీఆర్‌ఎస్‌కు వెళ్లి విఫలమయ్యా డు. తర్వాత వచ్చిన డకెట్ (13) లంచ్‌కు కొన్ని నిమిషాల ముందు అశ్విన్‌కే వికెట్ సమర్పించుకున్నాడు.

రూట్ నిలకడ..
లంచ్ తర్వాత రూట్‌తో జతకలిసిన ఆల్‌రౌండర్ మొయిన్ అలీ.. బ్యాట్స్‌మన్‌గా తన సత్తా ఏంటో చూపాడు. రెండు ఎండ్‌లలో ఈ ఇద్దరూ షమీ, అశ్విన్‌లపై పూర్తి ఆధిపత్యాన్ని చూపెట్టారు. భారీ షాట్లకు పోకుండా నిలకడగా స్ట్రయిక్‌ను రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. వీలైనప్పుడల్తా చెత్త బంతిని బౌండరీలకు తరలించిన రూట్ సాధికారిక షాట్లతో అలరించాడు. ఈ సెషన్‌లో అశ్విన్ ఆరు ఓవర్లు వేయగా, షమీ నాలుగు ఓవర్లు వేసి మోకాలి కండర సమస్యంతో మైదానం వీడాడు. షమీ గాయంతో ఇబ్బందిపడటం కోహ్లీ, మేనేజ్‌మెంట్‌లో ఆందోళనను నింపింది. ఈ ఇద్దరి స్థానంలో ఎక్కువగా బౌలింగ్ చేసిన జడేజా, ఉమేశ్‌లు ఇంగ్లీష్ ఆటగాళ్లపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో 92 నిమిషాలు క్రీజులో ఉన్న రూట్… సింగిల్ తీసి 72 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇద్దరి సమయోచిత బ్యాటింగ్ వల్ల తొలి 16.3 ఓవర్లలో 54 పరుగులు సమకూరాయి. క్రీజులో పాతుకుపోయిన ఈ జంటను విడదీసేందుకు విరాట్.. మిశ్రాను రెండో స్పెల్‌కు దించాడు. కానీ నాలుగు ఓవర్లు వేసిన అతను 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఓవరాల్‌గా ఈ సెషన్ మొత్తం రూట్, అలీల ఆధిపత్యమే నడిచింది. నాలుగో వికెట్‌కు అజేయంగా 107 పరుగులు జోడించి టీ విరామానికి వెళ్లారు.

సూపర్ సమన్వయం..
టీ విరామం నుంచి వచ్చిన వెంబడే భారత్‌కు వికెట్ దక్కే అవకాశాన్ని పుజారా వృథా చేశాడు. 99 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అలీ.. అశ్విన్ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ లెగ్‌లో పుజారా జారవిడిచాడు. ఇక ఇక్కడి నుంచి టీమ్ ఇండియా పరిస్థితి మరింత చేజారింది. మోకాలి నొప్పితోనే షమీ బౌలింగ్ చేయగా, ఉమేశ్, మిశ్రా, జడేజా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఓ దశలో ఉమేశ్ వేసిన బంతి రూట్ ప్యాడ్‌ను తాకడంతో భారత్ రెఫరల్‌కు వెళ్లింది. కానీ థర్డ్ అంపైర్ దీన్ని తోసిపుచ్చాడు. ఈ సంఘటన నుంచి తొందరగానే తేరుకున్న రూట్ ..154 బంతుల్లో కెరీర్‌లో 11వ సెంచరీని సాధించాడు. భారత్‌పై ఆడిన గత ఆరు టెస్టుల్లో 100 సగటును నమోదు చేసిన అతను ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం విశేషం. ఇక రెండో ఎండ్‌లో అలీ కూడా దీటుగా బ్యాటింగ్ చేశాడు. సింగిల్స్, డబుల్స్, అవసరమైతే ఫోర్‌తో రన్‌రేట్ తగ్గకుండా చూశాడు.

ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రెండో కొత్త బంతితో ఉమేశ్ విడగొట్టాడు. వేగంగా వచ్చిన బంతిని భారీ షాట్‌గా మలిచే ప్రయత్నంలో రూట్.. ఉమేశ్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే దీన్ని అందుకోవడంలో తడబడిన బౌలర్ నేర్పుగా బంతిని కొన్ని సెకన్ల పాటు చేతుల్లో నుంచి గాలిలోకి ఎగరేశాడు. చివరకు థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో రూట్ వెనుదిరిగాడు. 102/3 స్కోరు ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన రూట్.. అలీతో కలిసి నాలుగో వికెట్‌కు 179 పరుగులు జోడించారు. ఈ దశలో వచ్చిన స్టోక్స్ మెల్లగా ఆడుతూ మరో వికెట్ పడకుండా రోజు ముగించాడు.

వరుసగా రెండేండ్లలో వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్ రూట్. గతేడాది 14 టెస్టుల్లో 1385, ఈసారి 13 టెస్టుల్లో 1110 పరుగులు చేశాడు. అయితే ఈ ఒక్క ఏడాదిని తీసుకుంటే వెయ్యి పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్. బెయిర్‌స్టో (1118) ఇతనికంటే ముందున్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *