ఎన్టీఆర్ లేనిదే నా సినిమా లేదు రాజమౌళి…,

రాజమౌళి ‘గరుడ’ కథ ‘మహాభారతం’ నేపథ్యంలోనే ఉంటుందా? అవునని కొందరు, కాదని కొందరు సినీ క్రిటిక్స్ వాదులాడుకుంటున్న టైమ్ లోనే, ఇంకో ఎమేజింగ్ వార్త బయటకొచ్చింది. ఇప్పటికే ఈ ‘గరుడ’ పైన రాజమౌళి ఐదుగురు ప్రముఖులను సంప్రదించారనీ, అందులో ఇద్దరు సాహితీ సినీ రంగాలతో సంబంధాలున్నవారనీ, మిగిలిన ముగ్గురిలో ఒకరు బిగ్ ‘బీ’ అనీ, ఇంకొకరు థియేటర్-కమ్-మూవీ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్ అనీ, ఆఖరున డ్రీమ్ గర్ల్ హేమమాలిని అనీ! గరుడ సినిమా స్క్రిప్ట్ లో భాగంగా పురాణ పురుషుడు గరుత్మంతుడి కథను ఇతిహాసానికి కనెక్ట్ చేస్తూ కథని తయారు చేసారూ అని సంవత్సరం క్రితమే వార్తలొచ్చాయి.

ఇహ ఇందులో మహేష్ బాబు నటిస్తాడన్న ప్రచారం ఓవైపు … జూనియర్ ఎన్టీ ఆర్, మోహన్ లాల్ తో కీలక పాత్రలు చేయించడానికి కూడా మరో వైపు టాక్స్ నడుస్తున్నట్టు మరో వార్త. ఇవన్నీ ఇలా ఉంటే…..కథ లో ఉండే డిమాండ్ దృష్ట్యా, స్క్రీన్ కు మరింత వెయిట్ కోసం బిగ్ బీ అమితాబ్ చేత ఇందులో ‘భీష్మ’ పాత్ర చేయించటానికి ఆయనతో రాజమౌళి…హిందీ సినిమా రంగం లోతనకున్న పరిచయాలద్వారా సంప్రదింపులు మొదలెట్టినట్టు తెలుస్తోంది. కథ లో కొంత మేరకు రామాయణం నుంచి కూడా తీసుకోవలసి ఉంటుంది కాబట్టి……అందులో కొన్ని పౌరాణిక పాత్రల కోసం హిందీ చిత్ర రంగ ప్రముఖులను ఎంపిక చేసే ఆలోచన కూదా ఉందట. ఎటూ 1000 కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి నేషనల్ రేంజ్ లో నటీ నటులని తీసుకోవలసి వస్తుంది. అంటూ అప్పట్లో అన్ని ప్రముఖ పత్రికలూ, న్యూస్ పోర్టల్స్ ప్రచారం చేస్తూ కథనాలు రాసాయి.

గరుడ గా అనుకున్న ఆ చిత్రం లో మహేష్ చేయటం లేదనీ తేలిపోయింది. అయితే జూనియర్ ని మాత్రం వదలనంటున్నాడు మన స్టార్ డైరెక్టర్. బాహుబలి2 తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ తో జతకట్టడం నిజమేనట. కానీ.. అది గరుడ చిత్రం కాదట. ఇదో ఇంకో కథట. అది కూడా అద్భుతంగా ఉండనుందట. ఇటీవలే స్టోరీ లైన్ కూడా ఎన్టీఆర్ కి వినిపించాడట జక్కన్న. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అయితే, రాజమౌళి – ఎన్టీఆర్ ల గరుడ లేదని విషయం నందమూరి అభిమానులకు మింగుడు పడటం లేదు. అయితే ఇంకా ఈ విశయం మీద మాత్రం ఖచ్చితమైన క్లారిటీ మాత్రం ఎవరికీ లేదు.

అయితే బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ‘మ‌హా భార‌తం’ను సినిమాగా చేసే అవ‌కాశాలున్నాయ‌ని కొన్ని నెల‌లుగా వార్తలు వ‌స్తున్నాయి. వాటిని జ‌క్కన్న కూడా ప‌లు సంద‌ర్భాల్లో ధృవీక‌రించాడు. ఎప్పటికైనా ‘మ‌హాభార‌తం’ని సినిమాగా తెర‌కెక్కిస్తాన‌ని అన్నాడు. మ‌హాభార‌తం తెర‌కెక్కిస్తే అందులో ఓ కీల‌క‌పాత్రకు ఎన్టీఆర్ మాత్రమే సూట‌వుతాడ‌ని జ‌క్కన్న స్నేహితులతో అంటున్నాడ‌ట‌. ఎన్టీఆర్ లేకుండా మ‌హా భారతం అనే ఆలోచ‌న త‌న మ‌దిలో లేద‌ని ఘంటాప‌థంగా చెబుతున్నట్లు ఇన్ సైడ్ టాక్. అందులో డిఫ‌రెంట్ క్యారెక్టర్లను ఎన్టీఆర్ తో చేయించే ఛాన్సుందిట‌. దానికి సంబంధించి ఆర్ట్ అండ్ డిజైనింగ్ వ‌ర్క్ మొద‌లైన‌ట్లు ఫిలిం సర్కిల్స్ లో ముచ్చటించుకుంటున్నారు….

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *