ట్రంప్‌ని అమెరికా అధ్యక్షుడిగా చేశా.. లోకేష్‌ని ఎమ్మెల్యే చేయలేనా..?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు డాక్టర్ కేఏపాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ప్రభుత్వంలోకి అడుగుపెడుతున్న ఆయనను ఉద్దేశించి పాల్ ఓ ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నారు. ఆయనకు అండగా ప్రచారం చేసి గెలిపిస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రచారం చేసినట్టుగానే లోకేశ్‌కు కూడా చేస్తానని, వెనక్కు తగ్గవద్దని సూచించారు. ట్రంప్‌ను అమెరికా అధ్యక్షుడిని చేశా… లోకేష్‌ను ఎమ్మెల్యేగా గెలిపించలేనా..? అని పేర్కొన్నారు.

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్‌.. ఎమ్మెల్సీగా రావొద్దని, ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని సూచించారు కేఏ పాల్. అవసరమైతే తానే స్వయంగా లోకేశ్‌ను గెలిపించేందుకు ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకుంటానని, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కోసం ప్రచారం చేసి గెలిపించినట్లుగానే లోకేశ్‌కు ప్రచారం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. ఈ విషయంలో లోకేశ్‌ ఏమాత్రం వెనకడుగు వేయోద్దంటూ సూచించారు.

Videos

675 thoughts on “ట్రంప్‌ని అమెరికా అధ్యక్షుడిగా చేశా.. లోకేష్‌ని ఎమ్మెల్యే చేయలేనా..?

Leave a Reply

Your email address will not be published.