కార్తి…. ‘కాష్మోరా’ ట్రైలర్ అదిరిపోయింది (వీడియో)

హీరో కార్తీ ‘కాష్మోరా’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన కార్తి డిఫరెంట్ లుక్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. తాజాగా ట్రైలర్ కూడా వచ్చింది. ఈ చిత్రంలో కార్తీ పాత్ర మూడు విభిన్నమైన షేడ్స్ లో ఉంటుందని….సైనికాధికారిగా, గూఢచారిగా, నేటితరం యువకుడిగా మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రంలో నయనతార, శ్రీ దివ్య హీరోయిన్లుగా చేస్తున్నారు.

ఇందులో నయన్ రత్నమహాదేవి పాత్రలో కనిపించబోతోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే గతంలో మనమెప్పుడూ చూడని నయనతారను చూడబోతున్నామని స్పష్టమవుతోంది. పీవీపీ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కాష్మోరా ఫస్ట్‌లుక్ విడుదల దగ్గరనుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది. కార్తి కెరీర్లోనే ఇదే బిగ్గెస్ట్ చిత్రం కాబోతోందని అంటున్నారు.

Videos

258 thoughts on “కార్తి…. ‘కాష్మోరా’ ట్రైలర్ అదిరిపోయింది (వీడియో)

Leave a Reply

Your email address will not be published.