కబాలి టీజర్

రజనీ కాంత్ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు ‘కబాలి’ టీమ్ కొద్దిసేపటి క్రితం ఫస్ట్ టీజర్‌ను విడుదల చేసింది. ఉదయం పదకొండు గంటలకు ఈ టీజర్ ఇలా రిలీజ్ అయిందో, లేదో, సోషల్ మీడియా మొత్తం రజనీ జపం చేస్తూ పోయింది. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‍బుక్ అంతా కబాలి టీజర్ ప్రభంజనం సృష్టిస్తూ పోతోంది.

తమిళంలో రియలిస్టిక్ సినిమాలతో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సెట్ చేసుకున్న పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏ స్థాయిలో ఉండనుందో టీజర్ స్పష్టం చేసింది. ముఖ్యంగా రజనీ స్టైల్‌కి అభిమానులంతా ఫిదా అయిపోయారు. రజనీ కాంత్ డైలాగ్ డెలివరీ, స్టైల్, సంతోష్ నారాయణ్ అదిరిపోయే బ్యాంక్‌గ్రౌండ్ మ్యూజిక్.. అన్నీ కలిపి ఈ టీజర్‌ను టాప్ క్లాస్‌గా నిలబెట్టాయి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను కళైపులి థాను నిర్మించారు. రజనీ ఓ వయసైన గ్యాంగ్‌స్టర్‌గా నటించిన ఈ సినిమా, జూన్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *