ఆంటీ లుక్కులైనా… మోడ్రన్ గాళ్ లుక్కులోనైనా..

కాజల్ అగర్వాల్ సీనియర్ హీరోయిన్ కళ్యాణ్ రామ్ వంటి చిన్న హీరోలతో కూడా చేయడానికి రెడీ అయిపోతోంది. చేసేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 కూడా చేసినా.. ఆమెకు పెద్ద హీరోల నుండి పిలుపుమాత్రం రాలేదు. అందరూ కూడా కొత్త కొత్త హీరోయిన్లవైపే వెళుతున్నారు.

ఆల్రెడీ తేజ సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’లో ఆమె రానా కు భార్యగా నటిస్తోంది. అందుకే ఆ పాత్రలో హుందాతనం తీసుకురావడానికి ఆమెకు చీరలనే కాస్ట్యూమ్ గా డిసైడ్ చేశారు. చూస్తుంటే వయస్సు 30 దాటేసింది కాబట్టి కాజల్ ను మనోళ్ళు ఆంటీ తరహాలో ట్రీట్ చేస్తున్నారనే ఫీలింగ్ వస్తోందట ఆమె అభిమానులకు. ఇకపోతే ఆంటీ లుక్కులైనా… మోడ్రన్ గాళ్ లుక్కులోనైనా.. కాజల్ మాత్రం తన ఛమక్కులను బాగానే దట్టిస్తోంది. ఈ చిన్న సినిమాలు సక్సెస్ అయితే ఆమెకు కెరియర్లో మరో అరడజను సినిమాలేమైనా వస్తాయేమో చూడాలి.

ఇప్పుడిక కళ్యాణ్ రామ్ తీస్తున్న ఎమ్మెల్యే సినిమాలో కూడా కాజల్ చీరకట్టులోనే దర్శనమిస్తోంది. చూస్తోంది అక్కడ కూడా ఆంటీ తరహా రోల అనే సందేహం వస్తోంది. అయితే కాజల్ గ్లామరోత్సవానికి ఎప్పుడూ రెడీగా ఉండే హీరోయిన్.

Videos

Leave a Reply

Your email address will not be published.