బాత్‌రూంలో దాక్కున్న కళానికేతన్ డైరెక్టర్: తలుపులు పగులగొట్టి అరెస్ట్

ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కళానికేతన్ ఎండీ సతీమణి.. కంపెనీ డైరెక్టర్ అయిన లక్ష్మి శారదను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని చేనేత తయారీదారులకు రూ.9కోట్ల మేర మోసం చేసిన కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. ధర్మవరానికి చెందిన 80 మంది చేనేత తయారీదారుల నుంచి రూ.9కోట్లు విలువైన వస్త్రాల్ని కళానికేతన్ సంస్థ కొనుగోలు చేసింది. కానీ.. వీరికి డబ్బు చెల్లించలేదు.

ఇంట్లో లక్ష్మీ శారద ఒక్కరే ఉన్నారు. ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు అందించారు. దీంతో ఆమె తాను దుస్తులు మార్చుకొని వస్తానంటూ బాత్ రూమ్‌లో దాక్కున్నారు. అరగంట దాటినా బయటకు రాలేదు. ఎంతసేపు పిలిచినా ఆమె తలుపు తీయకపోవడంతో చివరకు తలుపులు పగలుగొట్టి ఆమెను అరెస్ట్ చేశారు.

అయితే ఇదంతా జరగడానికి ముందే ఆమె సెల్‌ఫోన్‌తో పోలీసులు ఇంటికి వచ్చిన విషయాన్ని లాయర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమె తరుపు లాయర్ పోలీసులతో మాట్లాడుతుండగా, ఆమె ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో వెంటనే ఆమెను జూబ్లిహిల్స్‌లోని ఆపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. ఆమెకు 41, 47 సీఆర్పీపీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించిన ధర్మవరం పోలీసులు లక్ష్మీశారదను తమతో పాటు తీసుకెళ్లారు. వీరిపై మొత్తం అయిదారు కేసులు నమోదయ్యాయి.

దీంతో కళానికేతన సంస్ధతో పాటు సంస్ధ ఎండీ వేములూరి లీలాకుమార్, ఆయన సతీమణి వేములూరి లక్ష్మీశారద, జి.రాజుకృష్ణ, జె. వెంకటేశ్వర రవిప్రసాద్‌లపై ధర్మవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వీరందరిపై ఈ ఏడాది జనవరి 11న కేసు నమోదైంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *