ఫస్ట్ లుక్: కళ్యాణ్ రామ్ ఇజం

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇజం’. జూలై 5 డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఈరోజు ‘ఇజం’ టైటిల్‌ను ఎనౌన్స్‌ చేసి, ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్‌లో రిలీజ్‌ చేశారు.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. ఆగస్ట్‌ 9 నుంచి నెలాఖరు వరకు స్పెయిన్‌లో భారీ షెడ్యూల్‌ జరుగుతుంది. సెప్టెంబర్‌ 29న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ – ”పూరిగారితో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తయితే, పూరిగారితో చేస్తున్న ‘ఇజం’ చిత్రం మరో ఎత్తు. ఒక డిఫరెంట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది” అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *