ఫస్ట్ లుక్: కళ్యాణ్ రామ్ ఎంఎల్ఏ

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, కాజ‌ల్ ప్ర‌ధానా పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ఎంఎల్ ఏ (మంచి ల‌క్ష‌ణాలు ఉన్న అబ్బాయి). నూత‌న ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్ప‌టికే ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా, రెండో షెడ్యూల్ రీసెంట్ గా హైద‌రాబాద్ లో జ‌రుపుకుంటుంది. కాజ‌ల్ కూడా రెండు రోజుల క్రితం చిత్ర యూనిట్ తో క‌ల‌వ‌గా, ప్ర‌ధాన పాత్ర‌ల‌పై కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్క‌స్తున్నారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ స‌రికొత్త లుక్ లో క‌నిపించ‌నున్నాడు. ఈ ఏడాది చివ‌రిలో విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని భరత్ చౌదరి మరియు కిరణ్ కుమార్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్ . ఇందులో క‌ళ్యాణ్ రామ్ .. నంద‌మూరి అభిమానుల ఆనందాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళేలా కనిపిస్తున్నాడు.

Videos

22 thoughts on “ఫస్ట్ లుక్: కళ్యాణ్ రామ్ ఎంఎల్ఏ

Leave a Reply

Your email address will not be published.