క‌ళ్యాణ్‌రామ్ కొత్త సినిమాలో కొత్త ట్విస్ట్‌

ఇజం ప్లాప్ త‌ర్వాత భారీ గ్యాప్ తీసుకున్న నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ ప్ర‌స్తుతం త‌న సోద‌రుడు ఎన్టీఆర్ హీరోగా త‌న బ్యాన‌ర్‌లో జై ల‌వ కుశ సినిమాను నిర్మిస్తున్నాడు. నిర్మాత‌గా ఈ సినిమా వ్య‌వ‌హారాల్లో బిజీజిజీగా ఉన్న క‌ళ్యాణ్ తాను హీరోగా న‌టించే సినిమాల విష‌యంలో సైతం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

ప‌టాస్ త‌ర్వాత షేర్ – ఇజం సినిమాలు చేసినా కళ్యాణ్ రామ్ హీరోగా హిట్ కొట్టడంలో మాత్రం కాస్త వెనకబడ్డాడనే చెప్పాలి. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఇజంపై మాత్రం కాస్త హోప్స్ పెట్టుకున్నాడు. దీనికోసం భారీగా ఖర్చు కూడా పెట్టాడు . ఈ సినిమా క‌ళ్యాణ్‌కు భారీ న‌ష్టాలు తేవ‌డంతో కొత్త సినిమాల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు.

క‌ళ్యాణ్‌రామ్ కామెడీ చిత్రాల స్పెష‌లిస్టు జి.నాగేశ్వ‌ర్‌రెడ్డి డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తాడ‌న్న టాక్ వ‌చ్చింది. అయితే నాగేశ్వ‌ర్‌రెడ్డి అల్ల‌రి న‌రేష్‌తో చేసిన ఇంట్లోదెయ్యం – నాకేం భ‌య్యం ప్లాప్ అవ్వ‌డంతో క‌ళ్యాణ్ నాగేశ్వ‌ర్‌రెడ్డితో సినిమా చేసే విష‌యంలో బ్యాక్‌స్టెప్ తీసుకున్నాడు.

లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం క‌ళ్యాణ్ ఒకేసారి రెండు సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. నారా రోహిత్ తో సావిత్రి సినిమా తీసిన పవన్ సాధినేనితో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు కళ్యాణ్. అలాగే ఉపేంద్ర అనే కొత్త దర్శకుడు చెప్పిన కధకు ఓకే చెప్పాడని సమాచారం. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఒకేసారి స్టార్ట్ కానున్నాయి. మ‌రి ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు అయినా క‌ళ్యాణ్‌కు హిట్ ఇస్తారేమో చూడాలి.

Videos

One thought on “క‌ళ్యాణ్‌రామ్ కొత్త సినిమాలో కొత్త ట్విస్ట్‌

  • November 15, 2019 at 10:04 am
    Permalink

    hi!,I like your writing very much! share we communicate more about your post on AOL? I require a specialist on this area to solve my problem. Maybe that’s you! Looking forward to see you.

Leave a Reply

Your email address will not be published.