త్వరలోనే ఎమ్మెల్యే గా నందమూరి కళ్యాణ్ రామ్..

నందమూరి కళ్యాణ్ రామ్ త్వరలోనే ‘ఎమ్మెల్యే’ కాబోతున్నాడు. అలాగని అతను రాజకీయ అరంగేట్రం చేసేస్తున్నాడేమో అనుకోవద్దు. ‘ఎమ్మెల్యే’ అనేది అతడి కొత్త సినిమాకు అనుకుంటున్న పేరు. ‘ఇజం’ తర్వాత తన తర్వాతి ప్రాజెక్టు విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న కళ్యాణ్ రామ్.. ఎట్టకేలకు ఉపేంద్ర అనే కొత్త దర్శకుడితో సినిమాకు కమిటయ్యాడు. శ్రీను వైట్లతో పాటు పలువురు దర్శకుల దగ్గర పని చేశాడు ఈ ఉపేంద్ర. అతను దర్శకుడిగా తొలి సినిమాను సునీల్ తో చేయాలనుకున్నాడు. కానీ వర్కవుట్ కాలేదు.

ఐతే సునీల్ కోసం తయారు చేసిన కథనే కళ్యాణ్ రామ్ ఇమేజ్ కు తగ్గట్లుగా మార్చి ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందట. ఓ రాజకీయ నాయకుడితో సవాల్ చేసి ఎమ్మెల్యేగా నిలబడిన కుర్రాడు.. ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి ఎత్తులేశాడనే కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందట. ఇది కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ లాగా ఉంటుందని సమాచారం. ‘ఎమ్మెల్యే’ అనేది ఇంతకుముందు ఎన్టీఆర్ కోసం అనుకున్న పేరు. ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ అనే అర్థంతో పెట్టిన పేరంటూ అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు ఆ టైటిలే అన్న దగ్గరికి వచ్చింది. కళ్యాణ్ రామ్ కెరీర్లో హిట్లు వచ్చింది కొత్త దర్శకులతోనే. సురేందర్ రెడ్డితో ‘అతనొక్కడే’.. అనిల్ రావిపూడితో ‘పటాస్’ అతడి కెరీర్లో మైలురాళ్లలా నిలిచాయి. మరి ఈ ‘ఎమ్మెల్యే’ కూడా ఆ కోవలోకే చేరుతుందేమో చూద్దాం.

Videos

Leave a Reply

Your email address will not be published.