నాని హీరోగా కళ్యాణ్ రామ్ సినిమా..?

 నాని హీరోగా నటించిన నిన్ను కోరి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది. నివేదా థామస్ – ఆది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ప్రేమకథా చిత్రానికి కొత్త దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నానిలాంటి క్రేజ్ ఉన్నహీరో ఎంపిక చేసుకోవడమే ఓ రకంగా సాహసమే అయినా ప్రేక్షకులను మెప్పిస్తోంది. దీని తర్వాత నాని వేణు శ్రీరామ్ ఎంసీఏ  (మిడిల్ క్లాస్ అబ్బాయ్) సినిమా చేస్తున్నాడు.  దీని తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేసేందుకు నాని ఓకే చెప్పాడని తెలుస్తోంది. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన సోదరుడు ఎన్టీఆర్ హీరోగా ‘జై లవకుశ’ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక నానితో తీసే సినిమాకు సంబంధించి విషయాలు ఫైనల్ చేసే అవకాశముంది. ప్రస్తుతం నాని ఎంసీఏ తో పాటు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేం మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు. ఇందులో నాని జంటిల్ మెన్ తర్వాత మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published.