రోబో-2 లో విలన్ రోల్ కోసం అడిగారు-కమల్

అసలు ‘రోబో’ సినిమాను ముందు అనుకున్నది కమల్ హాసన్ తోనే. ఆయనతో శంకర్ ఫొటో షూట్ చేసిన సంగతి కూడా అందరికీ తెలుసు. తరువాత ఆ ప్రాజెక్ట్ రజనీ చేతికి వెళ్లింది.  ఆ తరువాత రోబో 2 సమయంలో కూడా శంకర్, కమల్‌ను సంప్రదించాడట. అయితే ఈసారి కమల్‌తో విలన్ పాత్ర చేయించాలని భావించాడు శంకర్.

ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన కమల్, రోబో 2 చేయలేకపోవడానికి కారణాన్ని వివరించాడు. గతంలో రజనీ కమల్‌లు చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌కు చాలా గ్యాప్ వచ్చింది.ఆ సమయంలో తిరిగి కలిసి నటిస్తే మనలో ఎవరో ఒకరు ఆ సినిమాకు నిర్మాత అయి ఉండాలని ఒప్పందం చేసుకున్నారు ఈ ఇద్దరు స్టార్ హీరోలు.

అయితే రోబో 2 సినిమాకు బయటి వాళ్లు నిర్మాతలు కావటంతో రజనీ, కమల్ల మల్టీ స్టారర్ సాధ్యం కాలేదు. సరైన కథ దొరికితే రజనీతో కలిసి నటించడానికి ఎప్పుడూ సిద్దమే అన్నాడు కమల్. ప్రస్తుతం రోబో 2 సినిమాలో కమల్ చేయాల్సిన విలన్ పాత్రను బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పోషిస్తున్నాడు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *