అదో అద్బుతం ట్రైలర్ కోసమే 9 కోట్లు, కమల్ “మరుదనాయగం”..,
ఇంగ్లాండ్‌రాణి ఎలిజిబెత్ చేతుల మీదుగా ప్రారంభమైన చిత్రం మరుదనాయగం. వందలాది కళాకారులతో యుద్ధ సన్నివేశాలను తొలిరోజునే భారీ ఎత్తున కమల్ చిత్రీకరించారు. అలా 30 నిమిషాల సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత ఆర్థిక సమస్యల కారణంగా మరుదనాయగం చిత్ర నిర్మాణం ఆగిపోయింది. గతంలో ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఆగిపోయిన ‘మరుదనాయగం’ సినిమాను తిరిగి పూర్తి చేయనున్నాడు.
దాదాపు 18 సంవత్సరాల క్రితం కమల్ ‘మరుదనాయగం’ అనే చారిత్రక చిత్రానికి శ్రీకారం చుట్టాడు. కథ.. కథనాలు రెడీ చేసుకుని, తనే టైటిల్ రోల్‌ను పోషిస్తూ దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్‌తో అప్పట్లో ఈ సినిమా కొంతవరకు నిర్మాణం జరిగాక ఆర్థికపరమైన కారణాలవలన ఆగిపోయింది. అప్పటినుంచి ఈ సినిమాను పూర్తిచేయడానికి కమల్ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే వున్నాడు. తాజాగా.. ఆ ప్రయత్నాలు ఫలించే సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది. రెండు భారీ చిత్ర నిర్మాణ సంస్థలు ఈ సినిమా నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అయింగరన్ నిర్మాణ సంస్థ ‘మరుదనాయగం’ సినిమా పోస్టర్‌ను ట్విట్టర్లో పోస్ట్‌చేయడంతో ఈ సినిమా తిరిగి సెట్స్‌పైకి వెళుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
30 నిమిషాల సన్నివేశాలను: 1997 అక్టోబర్ 16వ తారీఖున ఇంగ్లాండ్‌రాణి ఎలిజిబెత్ చేతుల మీదుగా ప్రారంభమైన చిత్రం మరుదనాయగం. వందలాది కళాకారులతో యుద్ధ సన్నివేశాలను తొలిరోజునే భారీ ఎత్తున కమల్ చిత్రీకరించారు. అలా 30 నిమిషాల సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత ఆర్థిక సమస్యల కారణంగా మరుదనాయగం చిత్ర నిర్మాణం ఆగిపోయింది
మళ్ళీ మరుదనాయగం: ఆ తరువాత కమలహాసన్ పలుమార్లు ఈ చిత్రానికి పూర్తి చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అలాంటిది సుమారు 17 ఏళ్ల తరువాత మళ్ళీ మరుదనాయగం చిత్ర నిర్మాణానికి కమల్ నడుం బిగించారు. తన కల ప్రాజెక్ట్ ని తెరమీదికెక్కించటానికి దాదాపు ఇరవయ్యేళ్ళకి ఈ ప్రయత్నం మొదలయ్యింది.
బడ్జెట్ సమస్యలతో 40 శాతం షూటింగ్ పూర్తయిన తరువాత అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆ తరువాత కమల్‌హాసన్ ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ, ‘మరుదనాయగం’కు మాత్రం కమల్ ఊపిరి పోయలేకపోయారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఆగిపోయిన ఈ చిత్రాన్ని మళ్లీ పునఃప్రారంభించేందుకు కమల్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
1997 లోనే ఒక సినిమా తీయాలనుకోవటం: ఈ స్థాయి బడ్జెట్ లో 1997 లోనే ఒక సినిమా తీయాలనుకోవటం అన్న ఆలోచనే అతి పెద్ద సాహసం అనిపిస్తోంది. ఎందుకంటే ఒక ట్రైలర్ కోసం 9 కోట్లు ఖర్చయ్యాయి అంటే ఇక సినిమాకి ఎన్ని కోట్లు కవాలి? ఇప్పుడు ఊహించినా అది బాహుబలిని మించి పోయే బడ్జెట్ అవుతుంది. ఈ సాహసం చేయటానికి కమల్ సిద్దపడటం ఆ సినిమా తెరమీదికి తేవటానికి పడ్డ కష్టం మామూలుది కాదు.