మహాద్భుతం.. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ

టీమిండియా యువ బ్యాట్స్‌మ‌న్ క‌రుణ్ నాయ‌ర్ చెన్నై టెస్ట్‌లో ట్రిపుల్ సెంచ‌రీ చేశాడు. టెస్టుల్లో అత‌నికిదే తొలి ట్రిపుల్ సెంచ‌రీ. కెరీర్లో కేవ‌లం మూడో టెస్ట్ ఆడుతున్న నాయ‌ర్‌.. సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచ‌రీ చేసిన భారత బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో సాధించిన తొలి సెంచ‌రీనే ట్రిపుల్ సెంచరీగా మ‌ల‌చిన తొలి భారత బ్యాట్స్ మన్ కరుణ్ నాయర్. అంతేకాదు టెస్టు క్రికెట్ చరిత్రలో గ్యారీ సోబర్స్, బాబ్ సింప్సన్ తర్వాత తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలచిన మూడో ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. అతని దూకుడుతో టీమిండియా కూడా టెస్టుల్లో అత్యధిక స్కోరు సాధించింది.

ఇంతకుముందు ఉన్న 726 పరుగుల రికార్డు బద్దలైంది. చివరికి 7 వికెట్లకు 759 పరుగుల దగ్గర భారత్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు 282 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ పై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు కావడం మరో రికార్డు. ఆకాశమే హద్దుగా చెలరేగిన నాయర్.. ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడాడు. చివరికి 381 బంతుల్లో 303 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు నాయర్. ఇంతకుముందు భారత్ తరఫున సెహ్వాగ్ రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. వీరూ కూడా ఇదే చెన్నై స్టేడియంలో తన అత్యధిక స్కోరు (319) చేయడం విశేషం.

అంతకుముందు తొలి సెంచరీనే డబుల్ గా మలచిన మూడో భార‌త బ్యాట్స్‌మ‌న్ గా కరుణ్ నాయర్‌ రికార్డు సృష్టించాడు. అత‌ని కంటే ముందు వినోద్ కాంబ్లి, దిలీప్ స‌ర్దేశాయ్ ఈ ఘ‌న‌త సాధించారు. మొత్త‌మ్మీద టెస్ట్ క్రికెట్‌లో ఈ ఘ‌న‌త సాధించిన 31వ ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు క‌రున్ నాయ‌ర్‌. ఈ క్రమంలో నాయర్ 250 పరుగుల మైలురాయిని అందుకొని.. అరుదైన క్లబ్ లో చోటు సంపాదించాడు. సెహ్వాగ్, లక్ష్మణ్, ద్రవిడ్ తర్వాత టెస్టుల్లో 250కి పైగా స్కోరు చేసిన భారత బ్యాట్స్ మన్ గా నిలిచాడు.

తొలి టెస్ట్ సెంచరీలో అత్యధిక స్కోరు చేసిన 23 ఏళ్ల కిందటి కాంబ్లి (224) రికార్డును కరుణ్ తుడిచిపెట్టేశాడు. అంతేకాదు ఐదో నంబర్ లేదా అంతకన్నా దిగువన బ్యాటింగ్ కు దిగి అత్యధిక స్కోరు చేసిన భారత ప్లేయర్ గానూ కరుణ్ నిలిచాడు. అతను ధోనీ (224) రికార్డును అధిగమించాడు. ఇంగ్లండ్ పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాట్స్ మన్ గానూ నిలిచాడు. 235 పరుగులతో కోహ్లి పేరు మీదున్న రికార్డును నాయర్ బద్దలు కొట్టాడు. అశ్విన్ (67)తో కలిసి నాయర్ ఆరో వికెట్ కు 181 పరుగులు, జడేజా(51)తో కలిసి ఏడో వికెట్ కు 138 పరుగులు జోడించడం విశేషం.

స్కోర్ వివరాలు..
ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ : 477/10
భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ : లేకేష్ రాహుల్ 199, పార్ధివ్ పటేల్ 71, పుజారా 16, కోహ్లీ 15, కరుణ్ నాయర్ 303(నాటౌట్), మురళీ విజయ్ 29, అశ్విన్ 67, జడేజా 51. మొత్తం : 745/6(బ్యాటింగ్ కొనసాగుతోంది..)
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *