ఫస్ట్ లుక్: ‘కాటమరాయుడు’గా పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మించిన పవన్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు టైటిల్ ప్రకటించలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాత శరత్ మరార్ సినిమా టైటిల్ గురించి అఫీషియల్ ప్రకటన చేసారు. ఈ విషయమై శరత్ మరార్ ట్వీట్ చేస్తూ…’పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్ సగర్వంగా ప్రకటిస్తోంది. పవన్ కళ్యాణ్-డాలీ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రానికి ‘కాటమరాయుడు’ టైటిల్ ఫిక్స్ చేసాం’ అంటూ ట్వీట్ చేసారు.

పవన్ కొత్త సినిమా పేరు ‘కాటమ రాయుడు’. ఈ విషయాన్ని ముందు రోజే ధృవీకరించిన నిర్మాత.. సరిగ్గా పవన్ పుట్టిన రోజు నాడు అర్ధరాత్రి 12 గంటలకు కాటమరాయుడు టైటిల్ లోగోని విడుదల చేశాడు. కోర మీసం పెంచిన పవన్ కొత్తగా కనిపిస్తుంటే.. కాటమరాయుడు  టైటిల్ మాత్రం పవర్ ఫుల్ గా అనిపించడం ఖాయం. అత్తారింటికి దారేది మూవీలో పవన్ పాడిన పాట ‘కాటమ రాయుడా.. కదిరి నరసింహుడా’ నుంచే కొత్త సినిమాకి టైటిల్ తీసుకున్నారనే విషయం అర్ధమవుతూనే ఉంది.

Katama-Rayudu-Movie-First-Look
Katama-Rayudu-Movie-First-Look

టైటిల్ పోస్టర్ లో ఇచ్చిన పవన్ లుక్ ని ఫైనల్ అని చెప్పలేకపోయినా.. సినిమాలో పవన్ ఎలా కనిపించనున్నాడనే క్యూరియాసిటికీ మాత్రం ఓ ఆన్సర్ దొరికేసినట్లే. మరోవైపు.. లెటరింగ్ తోనే కాటమరాయుడు ఎంత పవర్ఫుల్ గా ఉంటాడో చెప్పే ప్రయత్నం చేసింది యూనిట్. టైటిల్ లోగో పోస్టర్ కి అనూప్ రూబెన్స్ ఇచ్చిన బీజీఎం అదిరిపోయింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *