ఎంతరీమేక్ అయితే.., మరీ ఇంత కాపీ పేస్ట్ లాగానా..!? పవన్ పోస్టర్ పై విమర్శలు

కాటమ రాయుడు సినిమా అనౌన్స్ చేసిన తొలి రోజునుంచే ఇది రీమేక్ అంటూ ప్రచారం మొదలయ్యింది. అది రీమేక్ కాదని చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. సరే అనుకోండి ఊహించని విధంగా ఉంటుందీచ్ అంటూ షూటింగ్ మొదలు పెట్టగానే దర్శకుడు సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి జంప్ అయ్యాడు. అప్పటికప్పుడు గోపాలా గోపాల దర్శకుడు డాలీని తీసుకొచ్చి షూటింగ్ స్టార్ట్ చేసేసారు.

కొన్నాళ్ళు హీరోయిన్ కోసం, మరికొన్నాళ్ళు హీరో తమ్ముళ్ళకోసం.., మరికొన్నాళ్ళు టైటిల్ కోసం ఇలా ప్రతీ దశలోనూ ఏదో ఒక ఇబ్బంది తో నలిగి పోతూనే ఉన్నాడు ” కాటమ రాయుడు” అన్నీ దాటుకొని సినిమా మొదలుపెట్టినా ఈ ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు. ఈ దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ని చూసి పాత పాట మళ్ళీ పైకి వచ్చింది. కొత్తగా వచ్చిన స్టిల్ అచ్చుగుద్దినట్టు హీరోయిన్ చీర రంగుతో సహా ఒకేలాగా ఉండటం తో ఇది పక్కా రీమేక్ అంటూ మళ్ళీ ప్రచారం మొదలయ్యింది. అసలూ రీమేక్ అయితే వచ్చే నష్టమేమిటీ అంటారా?? ఒక సారి ఇది చదవండి

వీరమ్ లోని స్టిల్ లా ఉంది: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు సినిమా మీద విమర్శల వర్షం మొదలైంది. తను తీసే సినిమా స్ట్రైట్ సినిమాలా ఫీల్ కలిగిస్తున్నా పవన్ తీసేది ఓ రీమేక్ సినిమా అని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. అయితే ఈ విషయం ఎలా కనిపెట్టారు అంటే దీవాళికి రిలీజ్ చేసిన పోస్టర్స్ తో కన్ఫాం చేశారట. డాలి డైరక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు సినిమా దీవాళి గిఫ్ట్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఆ పోస్టర్ అచ్చు గుద్దినట్టు తమిళ సూపర్ హిట్ సినిమా వీరమ్ లోని స్టిల్ లా ఉంది.

కావొచ్చు ఎన్నో రీమేక్ లు వస్తున్నప్పుడు ఈ సినిమా రీమేక్ అయితే తప్పేమిటీ అంటారా?? అక్కడే ఉంది ట్విస్టు తమిళం లో అజిత్ హీరోగా నటించిన వీరమ్ తెలుగు లో “వీరుడొక్కడే” పేరుతో ఎప్పుడో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ అదే సినిమా అంటే ఇంకో ఫ్లాప్ ని కోరి మరీ తెచ్చుకున్నట్టే. అన్నది అభిమానుల భయం, అందుకే మొదటినుంచీ “కాటమ రాయుడు” వీరమ్ కి రీమేక్ కాదూ అని పదే పదే చెప్తోంది ఈ సినిమా యూనిట్.

అజిత్, తమన్నా జంటగా నటించిన ఈ సినిమా అక్కడ హిట్ సాధించింది. అయితే పవన్ తీసేది రీమేక్ కాదు కాని ఆ సినిమాలోని స్టిల్ తో పవన్ శృతి హాసన్ పోస్టర్ వచ్చేసరికి ఫ్యాన్స్ కంగారు పడటం మొదలు పెట్టారు. ఓ ఫ్యాక్షన్ కథతో వస్తున్న కాటమరాయుడు సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మించిన శరత్ మరార్ నిర్మిస్తున్నారు. మరి పవన్ సినిమా అంటే కొన్ని అంచనాలు ఉంటాయి. అలాంటిది ఇలా కాపీ పోస్టర్ తో దించేస్తే ఎలా అంటున్నారు అభిమానులు.

Videos

Leave a Reply

Your email address will not be published.