కాటమరాయుడు న్యూ ఇయర్ పోస్టర్స్

పవన్ కళ్యాణ్ మూవీ కొత్త సినిమా కాటమరాయుడు.. సెన్సేషన్స్ కంటిన్యూ చేస్తూ ఉండేలా ప్రొడ్యూసర్స్ బాగా అలర్ట్ గా ఉంటున్నారు. న్యూ ఇయర్ స్పెషల్ అంటూ రోజుకో కొత్త పోస్టర్ విడుదల చేస్తామని చెప్పారు. చెప్పినట్లుగానే పోస్టర్స్ ను వదులుతున్నారు. బాంబు పేలుళ్ల మధ్యలో పవన్ నడుస్తూ ఉన్న పవర్ ఫుల్ లుక్ ని రిలీజ్ చేసిన యూనిట్.. ఇవాల కొత్త పోస్టర్ వదిలింది.

కొత్త పోస్టర్ లో కూడా పవన్ నడుస్తున్న లుక్ నే ఇచ్చారు. అది కూడా సగం వరకూ. పవర్ స్టార్ ఇంట్లో నడుస్తుంటే.. వెనకనుంచి తీసిన పిక్ ఇది. విషయం ఏంటంటే.. రెండు పోస్టర్లలోను పవన్ ను సగం వరకే.. అది కూడా కాళ్ల వరకే చూపించడం ఆశ్చర్యకరం. సగం పోస్టర్ కే ఇంత రెస్పాన్స్ అయితే.. మొత్తం లుక్ ఇస్తే మాస్ పవర్ చూపిస్తాడు పవన్ అంటూ నిర్మాత చెప్పడంతో.. కొత్త పోస్టర్ లో అయినా పూర్తి లుక్ ఇస్తారని అనుకుంటే షరా మామూలుగానే సెకండ్ పోస్టర్ కూడా సగం లుక్ నే ఇచ్చారు. ఈ లెక్కన పూర్తిగా ఫేస్ చూడాలంటే జనవరి ఫస్ట్ వరకూ ఆగక తప్పదేమో.

ఈ ఎపిసోడ్ లో ఫ్యాన్స్ కి రిలీఫ్ ఇచ్చే మ్యాటర్ ఏంటంటే.. న్యూఇయర్ 2017 సందర్భంగా కాటమరాయుడు టీజర్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఇది మాత్రం ఫ్యాన్స్ ని ఖుషీ చేసేస్తోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్.. గెట్ రెడీ ఫర్ కాటమరాయుడు ఆన్ హ్యాపీ న్యూఇయర్.

katamarayudu-new-year-posters1
katamarayudu-new-year-posters1
Videos

One thought on “కాటమరాయుడు న్యూ ఇయర్ పోస్టర్స్

  • November 15, 2019 at 9:00 am
    Permalink

    This blog is definitely rather handy since I’m at the moment creating an internet floral website – although I am only starting out therefore it’s really fairly small, nothing like this site. Can link to a few of the posts here as they are quite. Thanks much. Zoey Olsen

Leave a Reply

Your email address will not be published.