బాలకృష్ణకు కౌన్సిలింగ్ అవసరం – కత్తి మహేష్

మొన్నటివరకు పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే టార్గెట్ అయ్యాడు కత్తి మహేష్. కానీ ఇప్పుడు బాలయ్య అభిమానుల ఆగ్రహానికి కూడా గురయ్యాడు. బాలకృష్ణకు కౌన్సిలింగ్ అవసరం అంటున్నాడు మహేష్. నటిసింహాన్ని తొందరగా హాస్పిటల్ కు తీసుకెళ్లి డాక్టర్ కు చూపించాలని సూచిస్తున్నాడు.

“మనుషుల్ని కొట్టడం అనేది అనైతికం. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజల్ని కొట్టడం అస్సలు సభ్యత కాదు. ప్రజాప్రతినిధిగా బాలయ్యకు ఎవర్నీ కొట్టే హక్కులేదు. అందుకే అతడికి కౌన్సిలింగ్ అవసరం. బాలయ్య ఒక భ్రమలో బతుకున్నాడు. తను ఓ రాజు అయినట్టు, రాజ్యాలు ఉన్నట్టు, తన వంశం మాత్రమే గొప్పదన్నట్టు ఫీలవుతున్నాడు. అతడికి సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం.” బాలయ్యపై కత్తి మహేష్ వెర్షన్ ఇది.

స్టార్స్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న కత్తి మహేష్.. సంక్రాంతి హీరోల్ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అజ్ఞాతవాసి సినిమాపై ఇప్పటికే ఎన్నో విమర్శలు చేశాడు. ఇప్పుడు బాలయ్యతో పాటు అతడు నటించిన జై సింహా సినిమాను టార్గెట్ గా చేసుకున్నాడు.

Videos

33 thoughts on “బాలకృష్ణకు కౌన్సిలింగ్ అవసరం – కత్తి మహేష్

Leave a Reply

Your email address will not be published.