శ్రీదేవి కూతురు జిమ్ బాడీ.. ఆన్ లైన్ లో వైరల్!!

శ్రీదేవి, బోనీ కపూర్ కూతురు జాన్వీ కపూర్.. త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతోంది. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ తో కలిసి.. హాలీవుడ్ మూవీ ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ రీమేక్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమా మొదలైనప్పటినుంచి.. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో హాట్ స్టార్ అయిపోయింది. తన అందంతో.. ఇప్పటికే తల్లి తగిన కూతురు అనిపించుకుంటున్న జాన్వీ.. ఇప్పటికే చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది.

తన బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు.. రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తోంది. తల్లిని మించిన ఫిట్ నెస్ తో.. ఇప్పటి హీరోయిన్లకు.. జాన్వీ కపూర్ పోటీ ఇస్తోంది. రీసెంట్ గా.. జిమ్ కు వెళ్లి బయటికి వస్తుండగా.. జాన్వీ ఇలా క్లిక్ మంది. ఈ ఫొటోలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి.

అందానికి తోడు.. మంచి ప్లాట్ ఫామ్ దొరకడంతో.. బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడం ఖాయమన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. తన ఎంట్రీ సక్సెస్ అయితే.. జాన్వీ ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published.