కీరవాణి ‘జై బాలయ్య’ నినాదంపై దుమారం

తెలుగు సాహిత్య విలువలు పడిపోవడం గురించి ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలకు ముందు సంచలన వ్యాఖ్యలతో వివాదానికి తెరతీశాడు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి. అప్పట్లో ఆయన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద దుమారమే రేగింది. ఇండస్ట్రీ జనాల నుంచి కూడా ప్రతిఘటన ఎదుర్కొన్నారాయన తాజాగా కీరవాణి మరో వివాదంలో చిక్కుకున్నారు. శుక్రవారం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘పైసా వసూల్’ ఫస్ట్ డే ఫస్ట్ సందర్భంగా.

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పైసా వసూల్ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ట్వీట్ చేశారు. అదే బాటలో సీనియర్ సంగీత దర్శకులు కీరవాణి కూడా థియేటర్లో అభిమానుల ఉత్సాహం గురించి ఓ ట్వీట్ చేశారు. అభిమానులు ‘జై హింద్’ అన్నంత ఆనందంగా, ఉత్సాహంగా జై బాలయ్య అంటూ నినదిస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు కీరవాణి.

అయితే కీరవాణి చేసిన ఈ ట్వీట్ పై పెద్ద దుమారమే రేగింది. జై బాలయ్య నినాదాన్ని జై హింద్ తో ఎలా పోలుస్తారని నెటిజన్లు విమర్శించారు. అదే సమయంలో కొందరు కులం ప్రస్థావన కూడా తీసుకురావటంతో వివాదం మరింత ముదిరింది. అయితే ఈ విమర్శలపై కీరవాణి కూడా ఘాటుగా స్పందించారు. తాను అర్జున్ రెడ్డి యూనిట్ ను కులం కోసమే ప్రశంసించానా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఫేక్ డీపీలు పెట్టుకునే కుక్కలు తన దేశ భక్తి గురించి మాట్లాడటం విడ్డూరమని గట్టి కౌంటర్ ఇచ్చారు కీరవాణి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *