బిగ్ షాక్‌: నెట్‌లో ఖైదీ నెం 150

టాలీవుడ్‌లో పెద్ద సినిమాల‌కు లీకుల క‌ల‌క‌లం పెద్ద ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. కోట్లాది రూపాయ‌ల‌తో తెర‌కెక్కిన పెద్ద సినిమాలు రిలీజ్‌కు ముందే నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న ఖైదీ నెం 150 సినిమా సైతం నెట్‌లో లీక్ అయ్యి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తోంది.

ఇటీవ‌లే రిలీజ్ అయిన ఖైదీ నెం 150 టీజ‌ర్ కొద్ది గంటల్లోనే పదిలక్షల వ్యూస్ సంపాదించి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే, తాజాగా ఈ సినిమాలోని చిన్న డాన్స్ బీట్ లీకైందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల హీరోయిన్ కాజల్, మెగాస్టార్‌పై ఒక మాస్ పాటను షూట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ పాట‌ను షూట్ చేస్తున్న‌ప్పుడు సెట్లోనే ఉన్న ఓ వ్య‌క్తి…. ఆ పాటలోని ఒక చిన్న బీట్‌ను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి నెట్‌లో పెట్టేశాడట. దీంతో 30 నిమిషాలున్న ఆ వీడియో నెట్‌లో హల్‌చల్ సృష్టించింది. తమ సినిమా లీక్‌లపై ఖైదీ బృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ డాన్స్ బీట్ లీక్ అవడం.. ఆ చిత్ర బృందానికి బిగ్ షాక్ ఇచ్చింది.

ఈ బిట్ చూసిన వాళ్లు మెగాస్టార్ డ్యాన్సులు ఇర‌గ‌దీశాడ‌ని..చిరు ఎనర్జీ అదిరిపోయింద‌ని అంటున్నారు. పాట‌లో కాజ‌ల్ అందాలు కూడా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచాయ‌ట‌. ఈ వీడియోను ఖైదీ నం 150 బృందం ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నప్పటికీ.. మళ్లీ మళ్లీ వేరు వేరు పేర్లతో అప్‌డేట్ చేస్తున్నారట లీకు వీరులు.

Videos

97 thoughts on “బిగ్ షాక్‌: నెట్‌లో ఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published.