‘ఖైదీ నెంబర్ 150 ‘ రీషూట్లు షురూ?

పెద్ద సినిమాలు అన్నాక జాగ్రత్తలు తప్పవు. ఒకటకి రెండు సార్లు చూసుకుని, సరిదిద్దుకోవడం కామన్. ఖైదీ నెంబర్ 150 సినిమా విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోందని తెలుస్తోంది. నిన్నిటికి నిన్న ఖైదీ షూట్ కు సెలవు ఇచ్చారు. మిగిలిన పనులు కొంచెం ఎక్కువే వుండడంతో రెండు యూనిట్లు గా మార్చి, చకచకా పనుల సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

హీరో చిరంజీవి లేని సీన్లను వివి వినాయక్ కానిచ్చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే చిరంజీవి వున్న సీన్లను ఆయనే తన సారథ్యంలో పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సీన్లలో కొన్ని ఇంతకు ముందు తీసినవే, కాస్త సరిగ్గా రాలేదనో, మైనర్ చేంజెస్ చేయాలనో మళ్లీ మెరుగులు దిద్దుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వున్నందున, షూట్ పార్ట్ చకచకా ఫినిష్ చేయాలని రెండు యూనిట్లు చేసినట్లు వినికిడి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *