కళ్ళు చెదిరే రేటు పలికిన ‘ఖైదీ’ ఓవర్సీస్ హక్కులు !

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ పై ఎంతటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ క్రేజ్ స్వదేశంలోనే కాక విదేశాల్లోనూ ఎక్కువగానేఉంది. తెలుగు సినీ అభిమానులు ఉన్న ప్రతి చోటా ఖైదీ ప్రభావం కనబడుతోంది. తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులు రూ. 14 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది.

ఈ భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులు దక్కించుకుంది ఏషియన్ ఫిల్మ్ అని కూడా తెలుస్తోంది. ఇకపోతే శాటిలైట్ హక్కులు రూ. 13 కోట్లకు అమ్ముడవగా, కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులు రూ.8.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ లెక్కల్ని బట్టి చూస్తే ఖైదీ ప్రీ రిలీజ్ బిజినెస్ తారా స్థాయిలోనే జరిగిందని ఇట్టే అర్థమవుతోంది. ఇక ఈ చిత్రాన్ని జనవరి 4న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published.