సచిన్ రికార్డును అధిగమించిన కోహ్లీ

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్ ని సృష్టించాడు. అది కూడా భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డు. వెస్టిండీస్ తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో శతకాన్ని బాది కోహ్లీ రికార్డుల మీద రికార్డులు నెలకొల్పాడు. ప్రపంచంలోని మూడు వన్డే జట్లపై ఎనిమిది అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ ఆసీస్, శ్రీలంక జట్లపై ఎనిమిదేసి సెంచరీలు చేసి ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. అతను ఆసీస్, శ్రీలంక, వెస్టిండీస్ జట్లపై సాదించాడు. ఈ రికార్డుతో పాటు విండీస్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, కరేబియన్ దీవుల్లో వన్డే కెప్టెన్ గా అత్యధిక పరుగుల రికార్డును, వన్డేలో అత్యధిక పరుగులు చేసిన భారత రెండో బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించాడు.

Videos

Leave a Reply

Your email address will not be published.