పదకొండు ఏళ్ల క్రితం టీనేజర్‌గా క్రికెటర్‌ ఆరంభించాను: కెప్టెన్ కోహ్లీ

ప్రపంచ క్రికెట్‌లో పరుగుల మోత మోగిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన 11 ఏళ్ల క్రికెట్‌ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన ట్విటర్‌లో భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు. పదకొండు ఏళ్ల క్రితం టీనేజర్‌గా క్రికెటర్‌ ఆరంభించాను. ఈ సుదీర్ఘ నా క్రికెట్‌ జర్నీ నన్ను మరింత ప్రతిబింబించేలా చేసింది. దేవుడు నాకు ఇంతటి ఆశీర్వాదం ఇస్తాడని ఎప్పుడూ కలగనలేదు. మీ కలల్ని సాకారం చేసుకోవడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవాలని, అందుకు తగిన శక్తి సామర్థ్యాలను సొంతం చేసుకోవాలి’ అని కోహ్లి పేర్కొన్నాడు. కోహ్లీ 19 ఏళ్ల వయసులో 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డేతో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచీ అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొత్తం 239 వన్డేలాడిన అతడు 77 టెస్టులు, 70 టీ20లు పూర్తి చేసుకున్నాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగుల క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న మాజీ కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ(11,363)ని ఇటీవలే కోహ్లీ(11,520) వెనక్కి నెట్టాడు. తొలిస్థానంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌(18,426) కొనసాగుతున్నాడు. ఇప్పటివరకూ మూడు ఫార్మాట్లలో కలిపి 20, 502 పరుగులు చేశాడు. ఇందులో 68 సెంచరీలు, 95 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published.