ఇది గొప్ప విజయం : కోహ్లీ

మంగళవారం జరిగిన చివరిదైన మూడో టీ20లో కోహ్లీసేన 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించి.. సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకుంది. దీంతో విండీస్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. విజయం అనంతరం ట్రోఫీతో కూడిన ఫొటోను కోహ్లీ ట్విటర్‌లో పోస్టు చేశాడు. ‘గొప్ప విజయం.. ఇక ఇప్పుడు మా దృష్టి వన్డే సిరీస్‌పైనే’ అంటూ కోహ్లీ పేర్కొన్నాడు.

నిన్న జరిగిన చివరి టీ20లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియా జట్టులో పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ (3/4) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో మొదట విండీస్‌ 146/6 కు పరిమితమైంది. పొలార్డ్‌ (58; 45 బంతుల్లో 1×4, 6×6) టాప్‌ స్కోరర్‌. రిషబ్‌ పంత్‌ (65 నాటౌట్‌; 42 బంతుల్లో 4×4, 4×6), విరాట్‌ కోహ్లీ (59; 45 బంతుల్లో 6×4) బ్యాట్‌ ఝళిపించడంతో లక్ష్యాన్ని భారత్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత జట్టులో మ్యాన్ ఆఫ్ సిరీస్ కృనల్ పాండ్యకు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దీపక్ చహార్ కు దక్కాయి. లెగ్ స్పిన్నర్ రాహుల్ చహార్ ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ గురువారం నుంచి ఆరంభం కానుంది.

 

Videos

Leave a Reply

Your email address will not be published.