కోహ్లీ ఇగో..కోచ్ తో గొడ‌వ కార‌ణంగా..బౌలింగ్ తీసుకున్నాడ‌

పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఉద్వేగం తారాస్థాయిలో ఉంటుంది. ఆడే క్రీడాకారులే కాదు.. బ‌య‌ట ఉన్న కోట్లాది మంది సైతం విప‌రీత‌మైన భావోద్వేగానికి గురి అవుతుంటారు. ఇక‌.. స‌రిహ‌ద్దుల్లోని జ‌వాన్లు మొద‌లుకొని.. చాలామంది పాక్ తో మ్యాచ్‌ను ప‌ర్స‌న‌ల్ గా తీసుకుంటారు. దాన్నో ఆట‌గా అస్స‌లు తీసుకోరు. పాక్ తో జ‌రిగే మామూలు మ్యాచ్ కే ఇంత హంగామా ఉంటే.. ఒక టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్ అంటే మ‌రెంత ఎమోష‌న్ ఉంటుందో మాట‌ల్లో చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు.

కానీ.. అందుకు భిన్నంగా టీమిండియాకెప్టెన్ కోహ్లీ వ్య‌వ‌హ‌రించారా? ఇగోతో జ‌ట్టు ఓడిపోవ‌టానికి కార‌ణ‌మ‌య్యారా? అన్న సందేహాలు క‌లిగేలా కొత్త విష‌యం ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఛాంపియ‌న్స్ ట్రోఫి ఫైన‌ల్ లో పాక్ చేతిలో టీమిండియా దారుణంగా ఓడిపోవ‌టం.. అనంత‌రం భార‌త జ‌ట్టు కెప్టెన్‌.. కోచ్ మ‌ధ్య విభేదాలు తెర మీద‌కు రావ‌టం.. కోహ్లీ మాట‌ను కుంబ్లే చెవిన వేసిన బీసీసీఐ తీరుతో త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి జ‌ట్టుకు గుడ్ బై చెప్పేశారు కుంబ్లే.
ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. గ‌డిచిన కొద్ది రోజులుగా ఈ వ్య‌వ‌హారానికి సంబంధించిన కొత్త అంశాలు బ‌య‌ట‌కువ‌స్తున్నాయి. కోహ్లీ తీరును మాజీ క్రికెట‌ర్లతో పాటు ప‌లువురు క్రీడాకారులు.. అభిమానులు తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు. ఈ విమ‌ర్శ‌ల వేళ‌.కోహ్లీ కామ్ గా ఉంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం కోట్లాదిమంది భార‌తీయుల్ని హ‌ర్ట్ చేసేలా ఉంది.

పాక్ తో ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగిన వేళ‌.. టాస్ గెలిస్తే త‌ప్ప‌నిస‌రిగా బ్యాటింగ్ తీసుకోవాల‌ని కోచ్ గావ్య‌వ‌హ‌రిస్తున్న కుంబ్లే సూచించాడ‌ట‌. అయితే.. అంత‌కు ఆర్నెల్ల ముందు నుంచి కోచ్ తో ఉన్న గొడ‌వ కార‌ణంగా.. ఇగోకి పోయిన కోహ్లీ.. తాను అనుకున్న‌ట్లుగా బౌలింగ్ తీసుకున్నాడ‌ట‌.

ఫైన‌ల్ సంద‌ర్భంగా టాస్ గెలిస్తే.. ఎట్టిప‌రిస్థితుల్లో బ్యాటింగ్ తీసుకోవాలంటూ పాక్ మాజీ కెప్టెన్.. సీనియ‌ర్ ప్లేయ‌ర్ ఇమ్రాన్ ఖాన్ పాక్ జ‌ట్టుకు ప‌దే ప‌దే చెప్ప‌టం మీడియాలోనూ ప్ర‌ముఖంగా వ‌చ్చింది. అందుకు భిన్నంగా కోహ్లీ ఫీల్డింగ్ తీసుకోవ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే.. కోహ్లీ నిర్ణ‌యం కేవ‌లం ఇగో కార‌ణంగా అన్న విష‌యం బ‌య‌ట‌కు రావ‌టం అంద‌రిని షాకింగ్‌కు గురి చేస్తోంది. అయితే.. ఈ విష‌యంపై కోహ్లీ ఇప్ప‌టివ‌ర‌కూ పెద‌వి విప్పింది లేదు. ఫైన‌ల్ మ్యాచ్ ఓట‌మి త‌ర్వాత జ‌ట్టు స‌భ్యుల్ని కూర్చొబెట్టుకొని కుంబ్లే దాదాపు అర‌గంట సేపు క్లాస్ పీకిన విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.  ఈ విష‌యాల్లో నిజం ఎంత‌న్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. ఒక‌వేళ కోహ్లీ ఇగో కార‌ణంగానే ఫీల్డింగ్ తీసుకోవ‌టం అయితే.. అత‌డెంత అద్భుత‌మైన ఆట‌గాడైనా భార‌త జ‌ట్టులో కొన‌సాగించ‌టానికి వీల్లేద‌న్న మాట‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. జ‌ట్టు ప్రయోజ‌నం కంటే కూడా త‌న మాటే నెగ్గాల‌న్న ధోర‌ణి చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌న్న విష‌యాన్ని బీసీసీఐ గుర్తిస్తే మంచిది.

Videos

60 thoughts on “కోహ్లీ ఇగో..కోచ్ తో గొడ‌వ కార‌ణంగా..బౌలింగ్ తీసుకున్నాడ‌

Leave a Reply

Your email address will not be published.