అమెరికా స్థావరాలను ఢీకొడతాం

తాము జరిపిన రెండు మధ్యంతర మసుదాన్ అణుక్షిపణుల పరీక్షలు విజయవంతం అయ్యాయని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్షిపణులతో ఫసిపిక్ లోని అమెరికా స్థావరాలను ఢీకొట్టగలమని చెప్పారు. అంతకుముందు జరిపిన ఐదో పరీక్ష విఫలం అవడంతో కిమ్ జాంగ్ ప్రత్యక్ష ఆధ్వర్యంలో ఆరోసారి మసుదాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించారు.

అయితే, ఈ పరీక్షలు జరిపినట్లుగానీ, లక్ష్యాన్ని ఛేదించినట్లుగానీ పరీక్ష రోజున ఉత్తర కొరియా ప్రకటించలేదు. పరీక్ష పూర్తయిన మరుసటి రోజు మాత్రం అధ్యక్షుడే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. నిన్న జరిపిన అణుక్షిపణుల పరీక్షలు గొప్ప కార్యక్రమాలని ప్రశంసించాడు. అణ్వాయుధాలతో కూడా తాము దాడి చేయగలమని మరోసారి వీటిద్వారా నిరూపితమైందని చెప్పారు. 2,500 కిలో మీటర్ల నుంచి 4,000 కిలో మీటర్ల వ్యవధిలో ఎక్కడి నుంచైనా దాడి చేయగలమని, అమెరికాను సైతం ఢీకొట్టగలమని చెప్పాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *