కోటది ఆవేదనా.? అసూయా.?

కోట శ్రీనివాసరావు.. పరిచయం అక్కర్లేని పేరిది. వెండితెరపై సరికొత్త విలనిజంకి కేరాఫ్‌ అడ్రస్‌గా వెండితెరపై ఓ వెలుగు తున్న నటుడు కోట శ్రీనివాసరావు. వయసు మీద పడ్తున్నాసరే, ఇంకా తనలో పస తగ్గలేదని కోట పలు సినిమాలతో నిరూపిస్తున్నారు. విలనిజం ఒక్కటే కాదు, ఏ పాత్రలో అయినాసరే జీవించేయడమే కోటకి తెలుసు. సీనియర్‌ నటుడైన కోట శ్రీనివాసరావు, అప్పుడప్పుడూ వివాదాల్లోకెక్కుతుంటారు.

తాజాగా, మరోసారి కోట శ్రీనివాసరావు నుంచి విమర్శనాస్త్రం దూసుకొచ్చింది. అది కూడా ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో నటించిన మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ గురించి. అయితే, ఆయనేమీ మోహన్‌లాల్‌ని విమర్శించలేదు. తెలుగు సినిమాల్లో తెలుగు నటులకు అవకాశమివ్వకపోవడం, పరాయి భాషా నటుల కోసం పాకులాడడాన్ని ఆయన ప్రశ్నించారు. కోట, ఇలా మాట్లాడటం ఇదే కొత్త కాదు. గతంలోనూ ఆయన ప్రశ్నించారు, ఇప్పుడూ ప్రశ్నిస్తున్నారు.

కోట ఆవేదనలో అర్థం వుంది. అలాగని, పరభాషా నటుల్ని తెలుగులోకి తీసుకోవద్దా.? అంటే, అదీ సమంజసం కాదు. అంతెందుకు, కోట శ్రీనివాసరావు తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ నటించారు. నటులకి బాషా బేధాల్లేవు. కానీ, ఇతర భాషల నుంచి నటుల్ని తెచ్చుకునేటప్పుడు, అంతటి గొప్ప నటుడు మనకి లేడనేంతలా ‘ఓవర్‌ పబ్లిసిటీ’ చేయడమే వివాదాస్పదమవుతోంది. బహుశా కోట ఆవేదన కూడా అదే కావొచ్చు. ‘పక్కవాళ్ళని పొగడటం తప్పు కాదు.. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు కదా..’ అంటారు కోట. టైమ్‌కి షూటింగ్‌కి రాని ఓ నటుడి విషయంలో అప్పట్లో కోట చాలా గుస్సా అయ్యారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *