‘శాతకర్ణి’ అదిరిపోయిందట.

నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’  ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. వందో సినిమాగా బాలయ్య ముందుకు చాలా ప్రతిపాదనలు వచ్చినా.. వాటన్నింటినీ కాదని ‘శాతకర్ణి’ చేయడానికి రెడీ అయ్యాడు. తన మీద బాలయ్య అంత నమ్మకం పెట్టడంతో క్రిష్ ఈ చిత్రాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ సినిమా కథాంశం ప్రకారం చూస్తే ఇది ఎక్కువ వర్కింగ్ డేస్ తీసుకునే సినిమానే కానీ.. క్రిష్ మాత్రం 79 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఆశ్చర్యపరిచాడు. దీంతో సినిమా క్వాలిటీ మీద కొంచెం సందేహాలు నెలకొన్నాయి.

ఐతే తాజాగా క్రిష్.. తన సినిమాను ఓ టాప్ డైరెక్టర్ కు చూపించాడట. ముంబయిలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న చోటికి వెళ్లి ఆ దర్శకుడు సినిమా చూశాడట. ఆయన్ని సినిమా బాగా ఆకట్టుకుందని సమాచారం. ఇంత తక్కువ ఖర్చుతో గొప్ప క్వాలిటీతో అంత భారీ సినిమాను పూర్తి చేయడంపై ఆ దర్శకుడు ఆశ్చర్యపోయాడట. శాతకర్ణి పాత్రను తీర్చిదిద్దిన తీరుకూ ముగ్ధుడైపోయాడట. బాలయ్య సహా నటీనటులందరి అభినయమూ అద్భుతంగా ఉందని కితాబిచ్చాడట ఆ డైరెక్టర్. ఐతే సినిమాలో కొన్ని అంశాల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. కొన్ని కరెక్షన్లు చెప్పాడట ఆ దర్శకుడు. క్రిష్ వాటిని అంగీకరించి ఆ మేరకు మార్పులు చేస్తున్నట్లు సమాచారం. విడుదలకు ఇంకా నెల రోజులు సమయం ఉండటంతో మార్పులు చేర్పులు చేయడానికి ఇబ్బందేమీ లేకపోయింది. మరోవైపు గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ పనులు శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం. నెలాఖరుకు సినిమా రెడీ అయిపోయే అవకాశముంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *