బాబు.. కేటీఆర్‌ను చూసైనా కొంచెం హుందాతనం నేర్చుకోండి!

రాజకీయ వ్యూహాల ప్రకారమే మాట్లాడినా.. లోలోపల లెక్కలు ఎన్ని ఉన్నా తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్లు తమ హుందాతనంతో ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఇది వరకూ సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కీర్తించారు. 108ల విషయంలో అయినా, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్ మెంట్ల విషయంలో అయినా.. రాజశేఖర రెడ్డి వాటిని మొదలుపెట్టిన తీరును తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మెచ్చుకున్నారు. వైఎస్ హయాంలో, కాంగ్రెస్ హయాంలో అవి బాగా పని చేశాయని కూడా కేసీఆర్ తేల్చి చెప్పాడు. ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి తమకేం ఇగో లేదని కేసీఆర్ స్వయంగా స్పష్టం చేశారు.

ఇక కేటీఆర్ కూడా చంద్రబాబును కీర్తించారు. హైదరాబాద్ కు కొన్ని ఐటీ కంపెనీలు రావడంలో చంద్రబాబు కష్టం ఉందని కేటీఆర్ మెచ్చుకున్నాడు. ఈ తీరు ఆహ్వానించదగినదే. అంతా నా వల్లనే, అంతా మా వల్లనే అని చెప్పుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం మినహాయింపులా కనిపిస్తోంది. ప్రభుత్వంలోని ముఖ్యులే ఈ విధంగా తమ ప్రత్యర్థి పార్టీలకు చెందిన మాజీ సీఎంలను ప్రశంసిస్తున్న వైనం స్ఫష్టంగా గోచరిస్తోంది.

మరి ఇప్పుడు విషయం ఏమిటంటే.. చంద్రబాబులో ఇలాంటి పరిణతి, హుందాతనం ఎప్పటికి కనపడుతుంది అని? ఏ విషయంలోనూ ఎవ్వరికీ క్రెడిట్ ఇవ్వడు చంద్రబాబు నాయుడు. తను పుట్టక ముందు విషయాల గొప్పదనానికి కూడా తనే కారణం అని చెప్పుకునే టైపు ఈయన. ఆఖరికి అమెరికా వెళ్లి.. అక్కడి తెలుగు వాళ్లకు తనే ఇంగ్లిష్ నేర్పించాను అనిచెప్పుకోవడం బాబు తీరుకు పరాకాష్ట. సత్య నాదెళ్ల ఐటీ చదువులు చదవడానికి తనే కారణం అని కూడా బాబు గ్యాస్ వదిలారు.

చెప్పుకోవడానికి అయినా ఒక హద్దూపద్దంటూ ఉండాలి. అలాగే.. తమ ప్రత్యర్థుల గొప్పదనాన్ని బాబు ఎప్పుడూ ఒప్పుకోడు. కాంగ్రెస్ హయాంలో మంచి పనులు ఏమీ జరగలేదు అని ఇప్పుడు కూడా అంటారీయన, కాంగ్రెస్ అవినీతి మాత్రమే చేసింది.. అని బాబుగారు చెప్పే మాట. ఈయన హాయంలో అర్ధరూపాయి కూడా అవినీతి జరగలేదని అంతా నమ్మేయాలి.

ఏ మాత్రం హుందా తనం.. వాస్తవాలను ఒప్పుకునే నైజం కనిపించడం లేదు చంద్రబాబులో. మరి తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నేతలను గమనించి అయినా బాబు ఆ హుందతనాన్ని అలవరుచుకుంటే బావుంటుందేమో!

Videos

53 thoughts on “బాబు.. కేటీఆర్‌ను చూసైనా కొంచెం హుందాతనం నేర్చుకోండి!

Leave a Reply

Your email address will not be published.