సమంత, చైతూల మ్యారేజ్ కి లైన్ క్లియర్ ?

నెమ్మదిగా తెరలు వీడిపోతున్నాయి. సమంత-నాగచైతన్యల పెళ్లి విషయంలో పెద్దగా ఇబ్బందులేమీ ఎదుర్యేలా లేవు. ఇరు కుటుంబాల నుంచి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లే కనిపిస్తోంది. స్వయంగా నాగార్జునే తన కోస్టార్ అయిన అమలను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నాగచైతన్య విషయంలో అతను అభ్యంతర పెట్టే పరిస్థితి లేదు. మరోవైపు రామానాయుడు ఫ్యామిలీలో కూడా దదాపుగా అందరూ ఓకే చెప్పేశారు. తాజాగా చైతూ తల్లి లక్ష్మి కూడా కొడుకు పెళ్లికి పచ్చ జెండా ఊపేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఆమె చెన్నైకి వచ్చి సమంతతో ఒక రోజంతా గడిపినట్లుగా టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నాగచైతన్య తాజా చిత్రాల కంటే ఆయన ప్రేమ వ్యవహారమే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాపిక్ ఆఫ్‌ ది టౌన్ గా నిలిచింది. చైతూ .. సమంతాతో ప్రేమలో పడ్డాడనే విషయం తెలిసినప్పటినుండి గాసిప్ రాయుళ్ళకు మంచి వార్త దొరికినట్టయింది. ఇక వీరి ప్రేమ వ్యవహారంపై వారు కథలే అల్లేస్తున్నారు. తాజాగా మరో కొత్త కథ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. సమంత ప్రేమలో మునిగి తేలుతున్న చైతన్య తన పెళ్లికి మదర్ సపోర్ట్ తీసుకోవాలని అనుకున్నాడట.

ఈ ఏడాది ఆఖర్లో కానీ.. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కానీ.. చైతూ-సమంత పెళ్లి పీటలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెల ‘బ్రహ్మోత్సవం’ ప్రమోషన్లలో భాగంగా ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నానంటూ సమంత కొన్ని హింట్లివ్వడం.. ఆ హింట్లతో ఇండస్ట్రీ జనాలందరూ చైతూనే ఆ హీరో అన్న అంచనాకు వచ్చేయడం తెలిసిందే. ఐతే చైతూ మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా పెదవి విప్పలేదు.

Videos

One thought on “సమంత, చైతూల మ్యారేజ్ కి లైన్ క్లియర్ ?

Leave a Reply

Your email address will not be published.