ఎల్ బి శ్రీరాం సొంత ఛానెల్

ఒకప్పుడు నటుడిగా ఓ వెలుగు వెలిగిన ఎల్బీ  ఇటీవలికాలంలో అంతటి ప్రభావం చూపించలేకపోతున్నాడు. కొత్తతరం రాకతో ఆయన కాస్త వెనకబడినట్టు అనిపించింది. రచయితగానూ ఇటీవల ఆయన  పెద్దగా సినిమాలేమీ చేయలేదు.  ఇన్నాళ్లూ నాటకం – సినిమా అనే మాధ్యమాలతో కొనసాగుతున్న ఆయన తాజాగా మరో కొత్త దారిని ఎంచుకున్నారు. కొత్త మాధ్యమంలోకి అడుగు పెడుతున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా యూ ట్యూబ్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటూ ఓ ఛానల్ ని ఆరంభించాడు. ఎల్బీ శ్రీరామ్ హార్ట్ ఫుల్ పిక్చర్స్ పేరుతో లఘు చిత్రాల్ని తీయబోతున్నాడట. కొత్తతరంతో పాటే ప్రయాణించాలన్న సంకల్పంతో ఇలా ఇంటర్నెట్ లోకి అడుగుపెట్టి యూ ట్యూబ్ ఛానల్ ని ఏర్పాటు చేశానని ఇక నుంచి అక్కడే నా హృదయాన్ని ఆవిష్కరిస్తారని ఎల్బీ చెప్పారు.

నేటి ట్రెండ్‌కి తగినట్టు షార్ట్ ఫిల్మ్ లతో వెబ్ ప్రపంచంలోనికి అడుగుపెట్టనున్నట్టు ఎల్.బి.శ్రీరామ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఎల్.బి. (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్) క్రియేషన్స్ బ్యానర్‌లో ఎల్.బి.శ్రీరామ్ హార్ట్ ఫిలింస్ పేరుతో లఘుచిత్రాలు చేయనున్నారు. మే 30న తన పుట్టినరోజునే రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించనున్న ఈయన కమర్షియల్ సినిమాలు కడుపు నింపడానికే అంటూ తనవైన భావాలు ఈ లఘుచిత్రాల ద్వారా వ్యక్తపరచడంతో మనసు నిండుతుందన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published.