లోకేష్ చంద్రబాబునే విసిగించాడు.. అందుకే అలా..!బాబు మైక్ ఆఫ్ చేశాడు…

తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ముగిసినా.. అందులో హైలెట్ అయిన కామెడీ ఎపిసోడ్లు మాత్రం ఇంకా సోషల్ మీడియాలో షేర్ అవుతూనే ఉన్నాయి. ఆ కామెడీల్లో ముఖ్యమైనది లోకేష్ బాబు ప్రసంగం. మంత్రి హోదాలో, ఇటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు ప్రసంగించారు. మరి లోకేష్ ప్రసంగం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రొటీన్ గానే ఉంది. అన్వయదోషాలు, పలకడంలో తప్పులు.. వ్యాక్యరణ దోషాలు.. ఇవన్నీ ఉన్నాయి.

కనీసం కొన్ని తేలికైన తెలుగు పదాలను పలకలేకపోయాడు లోకేష్ బాబు. ఆయన నాలిక మందమని మరోసారి స్పష్టం అయ్యింది. మరి ఇక్కడ అంతకు మించిన విశేషం ఏమిటంటే.. లోకేష్ ప్రసంగిస్తూ ఉండగా మైక్ కట్ అయ్యింది. లోకేష్ బాబు ఏదేదో చెప్పుకొంటూ పోతుండగా తొలిసారి మైక్ పక్కనే ఉన్న బెల్ మోగింది. దాని ద్వారా ప్రసంగాన్ని ముగించాలని సూచించారు. అయినప్పటికీ లోకేష్ తగ్గలేదు.

ఆ బెల్ ను ఆపేసి తన కచడాపచడా ప్రసంగాన్ని కొనసాగిస్తూ పోయాడు. మరి లోకేష్ ప్రసంగం విసుగు తెప్పించిందో ఏమో కానీ ఈ సారి ఏకంగా మైక్ కట్ అయ్యింది. అలా మైక్ ను కట్ చేసింది మరెవరో కాదు.. స్వయానా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు. తను కూర్చున్న సీటు ముందు మైక్ స్విచ్ ను పెట్టుకున్నారు బాబు. లోకేష్ ఎంతకూ తన ప్రసంగ ప్రయాసను ఆపకపోవడంతో బాబు మైక్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో లోకేష్ అవాక్కయ్యాడు. ఏం చేయాలో తెలియక మైక్ ముందు అలాగే నిలబడిపోయాడు.

ఏడ్వలేని నవ్వుతో తండ్రి వైపు చూడటంతో ఆయన మళ్లీ మైక్ స్విచ్ ఆన్ చేశారు. ఆ తర్వాత ఐదు నిమిషాల్లో ముగిస్తానంటూ లోకేష్ ప్రసంగాన్ని కొనసాగించాడు. మొత్తానికి లోకేష్ అతుకుల బొంత ప్రసంగం ఈ సారి చంద్రబాబును కూడా విసిగించినట్టుగా ఉంది. అందుకే ఆయన తన చేతులతోనే మైక్ స్విచ్ ఆఫ్ చేసి.. ముగించమన్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *