లండన్ మెట్రో రైలులో భారీ పేలుడు.. తొక్కిసలాట

నైరుతి లండన్‌లోని అండర్ గ్రౌండ్ ట్రైన్‌లో ఈ ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. పేలుడు నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. తమకు కాలిన గాయాలైనట్టు పలువురు ప్రయాణికులు తెలిపారు. ఓ బకెట్‌లో ఈ పేలుడు జరిగినట్టు పేర్కొన్నారు. దీనిని ఉగ్రదాడిగా పోలీసులు ధ్రువీకరించారు. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రతా దళాలు, బాంబ్ స్క్వాడ్, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ మార్గంలో నడిచే రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన బ్యాగ్ పేలడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని, ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. బ్రిటన్‌లో ఈ ఏడాది పలు ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో దీనిని కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *